Nandamuri Balakrishna: నా మనవళ్లు, మనవరాళ్లు నన్ను తాతా అని పిలిస్తే ఒప్పుకోను..

Nandamuri Balakrishna: నా మనవళ్లు, మనవరాళ్లు నన్ను తాతా అని పిలిస్తే ఒప్పుకోను..
X
Nandamuri Balakrishna: ఆడియన్స్‌కి తెలియని విషయాలను సరదాగా మాట్లాడుతూనే వారినుంచి రాబట్టాడు.

Nandamuri Balakrishna: ఆహాలో వచ్చిన నందమూరి బాలకృష్ణ షో అన్‌స్టాపబుల్. మొదటి సీజన్ సక్సెస్‌‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. వెండి తెరమీద రఫ్ఫాడించిన బాలయ్య ఓటీటీలో కూడా తనదైన స్టైల్లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. షోకి వచ్చిన తారలను ఒక ఆట ఆడుకున్నాడు.. ఆడియన్స్‌కి తెలియని విషయాలను సరదాగా మాట్లాడుతూనే వారినుంచి రాబట్టాడు.

మొత్తానికి బాలయ్యా మజాకా అనిపించాడు.. షో పూర్తయినా మళ్లీ అన్ని ఎపిసోడ్స్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో బాలయ్యతో ఓ వీడియో ప్లాన్ చేసింది ఆహా టీమ్. నెవర్ హావ్ ఐ ఎవర్ కాన్సెప్ట్ కింద కొన్ని ప్రశ్నలు అడగ్గా బాలయ్య వాటికి సమాధానాలు చెప్పారు..

తనను మనవళ్లు, మనవరాళ్లు ఎవరైనా తాతా, గ్రాండ్‌పా అని పిలిస్తే ఒప్పుకోనన్నాడు.. వాళ్లు తనని బాలా అని పిలిస్తేనే పలుకుతానని చెప్పాడు. పబ్లిక్‌లోకి వెళ్లి ఏమైనా చేయాలనుకుంటే ఆలోచించకుండా వెళ్లిపోతారా అంటే.. నాలాగా పబ్లిక్‌లోకి వెళ్లే ఆర్టిస్ట్ ఒక్కరు కూడా లేరని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Next Story