Mokshagna Teja : లయన్ కింగ్ రేంజ్ లో బాలయ్య కొడుకు సినిమా

Mokshagna Teja :  లయన్ కింగ్ రేంజ్ లో బాలయ్య కొడుకు సినిమా

నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీకి అంతా సిద్ధం అయింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో అతను హీరోగా లాంచ్ కాబోతున్నాడు. ఈ శుక్రవారమే ముహూర్తం కూడా సెట్ అయింది. తనయుడిని కూడా తన లాగే వైవిధ్యమై పాత్రల్లో చూడాలనుకుంటున్నాడు బాలయ్య. అందుకే ప్రశాంత్ వర్మతో లాంచ్ చేయిస్తున్నాడు. నిజానికి మోక్షజ్ఞను రాజమౌళితో పరిచయం చేయించాలనే ప్రయత్నాలు చేశారు అనే టాక్ కూడా కొన్నాళ్ల క్రితం వినిపించింది. బట్ ఆ ఛాన్స్ ప్రశాంత్ కు దక్కింది.

‘సింబా’ అనే టైటిల్ తో ఈ మూవీ రూపొందబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. సింబా అంటే ఇక్కడ అన్ని వయసుల వాళ్లకూ తెలుసు. ది లయన్ కింగ్ మూవీలో సింహం మహారాజు కొడుకు సింహం పేరు సింబా. మహారాజును అతని సోదరుడే చంపేస్తే.. పిల్ల సింబా పారిపోతాడు. కొంత పెద్దైన తర్వాత తిరిగి తన రాజ్యానికి వస్తాడు. అతను వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే కాన్సెప్ట్ తోనే ముఫాసా : ది లయన్ కింగ్ అనే టైటిల్ తో మరో సినిమా వస్తోంది. దీన్నే ఇక్కడ అప్లై చేస్తే..

టాలీవుడ్ అనే ఫారెస్ట్ కి లయన్ కింగ్ బాలయ్య. ఆయన తనయుడే సింబా. ఇప్పటికే ఎంతోమంది వారస హీరోలు పాతుకుపోయారు. అంటే సింబా ముందు చాలా చాలెంజెస్ ఉన్నాయి. అది సింబాలిక్ గా కూడా వర్కవుట్ అవుతుంది. మోక్షజ్ఞ మూవీ కూడా ఇలాగే ఉంటుందా అంటే ఉండదు. బట్ అలా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈమూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ అంటున్నారు. అలాగే ఈ కాలం కూడా ఉంటుందట. ఓ రకంగా బాలయ్య ఆదిత్య 369 తరహాలో అన్నమాట. మొత్తంగా నట సింహం తనయుడు సింబాగా రాబోతున్నాడన్నమాట.

Tags

Next Story