Balakrishna: 'అఖండ 2' కథకు బాలయ్య మార్పులు..

Balakrishna: అఖండ 2 కథకు బాలయ్య మార్పులు..
Balakrishna: అఖండ విడుదలయిన కొన్ని రోజులకే అఖండ 2 కూడా ఉండనుందని క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు.

Balakrishna: సినీ పరిశ్రమలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. వాటికి చాలా క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన‌తో ఎప్పుడు సినిమా వచ్చినా అది మినిమమ్ గ్యారెంటీ హిట్ అనిపించుకుంటుంది. అలాంటి ఒక కాంబినేషనే బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది. వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు సినిమాలు రాగా.. ఆ మూడు సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక త్వరలోనే ఈ కాంబినేషన్‌లో అఖండ 2 తెరకెక్కనుంది. అయితే దీనికోసం బాలయ్య కొన్ని మార్పులు చేర్పులు చెప్పినట్టు సమాచారం.

బాలయ్య, బోయపాటి సినిమా అనగానే నందమూరి ఫ్యాన్స్‌లో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. వీరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. 'సింహ' నుండి ప్రారంభమయిన వీరి సక్సెస్‌ఫుల్ జర్నీ.. అఖండతో కొనసాగించారు. అఖండతో చాలాకాలం తర్వాత సూపర్ డూపర్ కమర్షియల్ హిట్‌ను అందుకున్నారు బాలయ్య. ఇప్పుడు అఖండ 2 కోసం వర్క్ జరుగుతోంది.

అఖండ విడుదలయిన కొన్ని రోజులకే అఖండ 2 కూడా ఉండనుందని క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. అయితే అఖండ 2లో కొన్ని పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేయమని బోయపాటికి సూచించారట బాలయ్య. ప్రస్తుతం రామ్‌తో ఓ సినిమా చేయడానికి సిద్ధమయిన బోయపాటి.. దీని తర్వాత అఖండ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నట్టు టాక్.

Tags

Read MoreRead Less
Next Story