సినిమా

Balakrishna: పాన్ ఇండియా సినిమాకు బాలకృష్ణ డబ్బింగ్?

Balakrishna: నందమూరి బాలకృష్ణ.. ఈయన బయటికి చాలా రఫ్‌గా కనిపిస్తారు కానీ ఇతరులకు సాయం చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటారు.

Balakrishna: పాన్ ఇండియా సినిమాకు బాలకృష్ణ డబ్బింగ్?
X

Balakrishna: నందమూరి బాలకృష్ణ.. ఈయన బయటికి చాలా రఫ్‌గా కనిపిస్తారు.. కానీ ఇతరులకు సాయం చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటారు. ఇతర హీరోల సినిమాలకు సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా బాలయ్య ఏ మాత్రం ఆలోచించకుండా చేసేస్తారు. అందుకే దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలతో బాలయ్యకు మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా బాలకృష్ణ ఒక పాన్ ఇండియా సినిమాకు డబ్బింగ్ చెప్పబోతున్నాడన్న వార్త వైరల్‌గా మారింది.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. ఆ సినిమాలో విజయ్ వరల్డ్ క్లాస్ బాక్సర్ మైక్ టైసన్‌తో తలపడనున్నాడని ఇటీవల మూవీ టీమ్ స్పష్టం చేసింది. తెలుగుతెరపై మైక్ టైసన్‌ను చూపించడానికి సిద్ధపడడంతో ప్రేక్షకుల్లో లైగర్‌పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో మైక్ టైసన్‌కు డబ్బింగ్ చెప్పడానికి ఒక స్టార్ హీరో అయితే బాగుంటుందని మూవీ టీమ్ భావించిందట.

లైగర్‌లో మైక్ టైసన్‌కు డబ్బింగ్ చెప్పడానికి మూవీ టీమ్ సంప్రదించిందని, దానికి బాలయ్యకు పాజిటివ్‌గా రెస్పాన్డ్ అయ్యాడని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. డబ్బింగ్ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్తల్లో నిజం లేదని సమాచారం. పూరి జగన్నాధ్‌కు, బాలకృష్ణకు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఇలాంటి ఆఫర్ వచ్చిన ఆయన రిజెక్ట్ చేయడేమో అనుకుంటున్నారు ప్రేక్షకులు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES