Balakrishna: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సెకండ్ సీజన్.. ఫస్ట్ గెస్ట్ ఎవరంటే..

Balakrishna: వెండితెర మీద ఓ వెలుగు వెలుగుతున్న బాలకృష్ణ ఓటీటీ తెరపైన కూడా తనదైన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆహాలో ప్రసారమై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న మొదటి సీజన్ అన్‌స్టాబుల్ విత్ ఎన్‌బీకే.. రెండో సీజన్ ప్రసారం చేయడానికి సిద్ధమవుతోంది.
మొదటి సీజన్‌లో గెస్ట్‌గా వచ్చిన తారలనుంచి అభిమానులకు తెలియని సమాచారాన్ని అందించారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఎపిసోడ్ ను కొనసాగించేవారు బాలకృష్ణ తనదైన శైలిలో.. ఈ షో సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది.
తొలి సీజన్ విజయవంతంగా ముగియడంతో సెకండ్ సీజన్‌కు ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.. అయితే ఈ సీజన్‌కు ఫస్ట్ గెస్ట్‌గా మెగా స్టార్ చిరంజీవి వస్తాడని సమాచారం. అదే నిజమైతే అటు బాలకృష్ణ అభిమానులకు, ఇటు చిరంజీవి అభిమానులకు పండగే. ఒకే తెరపై ఇద్దరు స్టార్ హీరోలు చేసే సందడి చూడవచ్చు. ఆగస్ట్ లో తొలి ఎపిసోడ్ తీసుకురావడానికి యూనిట్ రెడీ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com