Balakrishna: 'అక్కడ ఉంది సింహం రారేయ్'.. బాలయ్య అప్‌కమింగ్ మూవీ నుండి డైలాగ్ లీక్..

Balakrishna (tv5news.in)
Balakrishna: బాలయ్య, బోయపాటి చేతులు కలిపితే సినిమా బ్లాక్‌బస్టరే అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే మరోసారి 'అఖండ'తో కూడా ప్రూవ్ అయ్యింది. బాలకృష్ణలోని మాస్ యాంగిల్‌ను చూపించాలంటే అది బోయపాటికే సొంతం అన్న రేంజ్‌లో తెరకెక్కించాడు ఈ సినిమా. అఖండ బిగ్గెస్ట్ హిట్‌గా, రికార్డ్ స్థాయి కలెక్షన్లను సాధించింది. బాలయ్య ఫార్మ్‌లోకి వచ్చేసరికి అభిమానులు ఆయన అప్‌కమింగ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించే టాలీవుడ్ దర్శకులలో గోపీచంద్ మలినేని కూడా ఒకరు. గతేడాది ప్రారంభంలోనే 'క్రాక్' సినిమాతో అదిరిపోయే హిట్‌ను అందుకున్న మలినేని.. బాలయ్యతో సినిమాను ఓకే చేసుకున్నాడు. ఇందులో బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ నటించనుంది. తాజాగా ఈ సినిమా నుండి ఓ డైలాగును అడిగి మరీ లీక్ చేయించుకున్నాడు బాలయ్య.
ఇటీవల 'అన్‌స్టాపబుల్' షోకి గెస్ట్‌లుగా రవితేజ, గోపీచంద్ మలినేని వచ్చి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్‌లో గోపిచంద్ మలినేనిని తమ అప్‌కమింగ్ సినిమా నుండి ఓ డైలాగ్ లీక్ చేయమని అడిగాడు బాలకృష్ణ. అప్పుడు మలినేని 'రోడ్డు మీదకు జింక, గొర్రె వచ్చినాయనుకో.. ఎవ్వడైనా హార్న్ కొడతాడు. అదే సింహం వస్తే హార్న్ కాదు కదా.. ఇంజన్ ఆఫ్ చేసి సైలెంట్‌గా ఉంటాడు. అక్కడ ఉంది సింహం రారేయ్' అంటూ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించింది. మరోసారి బాలయ్య ఓ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌లో కనిపించనున్నాడని చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ నిదర్శనంగా నిలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com