Balakrishna : సినిమా ఉన్నంతవరకు సినారె, ఎన్టీఆర్ జీవించి ఉంటారు : బాలకృష్ణ

Balakrishna : డాక్టర్ సినారె పాటలు అజమరమని కొనియాడారు ప్రముఖ సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు సినారె, ఎన్టీఆర్‌లు జీవించి ఉంటారన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వంశీ-శుభోదయం, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి నారాయణరెడ్డి 91వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నందమూరి బాలకృష్ణకు సినారె జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం ప్రదానం చేశారు.
సినిమా అనేది ఒకరి కష్టార్జితం కాదని.... అది అందరి కష్టమన్నారు బాలకృష్ణ. తెలుగు సాహిత్యాన్ని బతికించిన వారిలో సినారె ప్రథముడన్నారు. సినారె అశీస్సులతో మంచి మంచి పాత్రల్లో నటించినట్లు బాలకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ గర్నవర్ విద్యాసాగర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినారె గొప్ప కవి అని... తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తి అని ఆయన కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com