Balakrishna Wedding Card: వైరల్ అవుతున్న బాలకృష్ణ, వసుంధరల పెళ్లి పత్రిక..

Balakrishna Wedding Card: ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోలకు పోటీగా సీనియర్ హీరోలు కూడా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కూడా కొడుతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అయిపోయింది. కెరీర్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నందమూరి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ఇక బాలయ్య సినిమాల్లో బిజీ అయ్యే సమయానికి ఎన్‌టీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అందుకే బాలకృష్ణ పెళ్లి బాధ్యతలను తన స్నేహితుడు నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించారట. అప్పుడే ఆయన ప్రముఖ వ్యాపారవేత్త దేవరపల్లి సూర్యరావు కుమార్తె అయిన వసుంధరాదేవి సంబంధాన్ని తీసుకొచ్చారట.
బాలకృష్ణ సినిమాల్లో రాణిస్తున్నారు కాబట్టి కోడలు మాత్రం సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తి అయ్యిండాలని కోరుకున్నారట ఎన్‌టీఆర్. ఆయన అనుకున్నట్టుగానే వసుంధరాదేవి కోడలిగా వచ్చారు. ఇక పెళ్లిచూపుల్లోనే బాలయ్యకు వసుంధర తెగ నచ్చేశారట. ఆ తర్వాత కొన్నాళ్లకే వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com