సినిమా

Balakrishna : బిగ్‌బాస్‌ హోస్ట్‌గా బాలయ్య?

Balakrishna : ఇటీవలే సక్సెస్‌‌‌ఫుల్ గా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 5 ముగిసిన సంగతి తెలిసిందే.. అయితే గ్రాండ్‌ ఫినాలే రోజున బిగ్‌బాస్‌ తర్వాతి సీజన్‌ మరో రెండు నెలల్లో రాబోతుందని కింగ్ నాగార్జున ప్రకటించాడు.

Balakrishna : బిగ్‌బాస్‌ హోస్ట్‌గా బాలయ్య?
X

Balakrishna : ఇటీవలే సక్సెస్‌‌‌ఫుల్ గా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 5 ముగిసిన సంగతి తెలిసిందే.. అయితే గ్రాండ్‌ ఫినాలే రోజున బిగ్‌బాస్‌ తర్వాతి సీజన్‌ మరో రెండు నెలల్లో రాబోతుందని కింగ్ నాగార్జున ప్రకటించాడు. అది ఆరోవ సీజనా ? లేకా బిగ్‌బాస్‌ ఓటీటీ మొదటి సీజనా? అన్న దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం అయితే అది ఓటీటీ సీజన్‌ అని ప్రచారం నడుస్తోంది. అయితే దీనికి నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌‌‌గా చేయనున్నారన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆహాలో అన్‌స్టాపబుల్‌ షోలో హోస్ట్‌గా బాలయ్య ఆదరగోడుతున్నాడు.. అలాంటి బాలయ్యకు బిగ్ బాస్ హోస్ట్ గా ఇస్తే రఫ్ఫాడిస్తాడని నెటిజన్లు అంటున్నారు. దీనిపైన క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా బిగ్‌బాస్‌ తొలి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని, మూడు, నాలుగు, ఐదో సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES