Balakrishna : ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలపై బాలకృష్ణ ప్రకటన..!

Balakrishna : ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలపై బాలకృష్ణ ప్రకటన..!
X
Balakrishna : ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలపై ఆయన తనయుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు.

Balakrishna : స్వర్గీయ ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలపై బాలకృష్ణ ప్రకటన చేశారు. నందమూరి కుటుంబం నుంచి నెలకు ఒకరు.. ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. శతజయంతి ఉత్సవాల్లో వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈనెల 28 నుంచి ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ప్రారంభమవుతాయని... అప్పటి నుంచి వచ్చే ఏడాది మే 28 వరకూ... 365 రోజుల పాటు శత పురుషుని శతజయంతి వేడుకలుగా నిర్వహిస్తామన్నారు. అలాగే నెలకు రెండు ఎన్టీఆర్‌ పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుందన్నారు. తెనాలిలోని పెమ్మసాని థియేటర్‌లో శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతామని బాలకృష్ణ ప్రకటించారు.

Tags

Next Story