Balakrishna : బాలయ్య హీరోయిన్ మారింది.. రీజన్ ఏంటీ..?

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల పరంగా చాలా దూకుడున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో 109వ సినిమా చేస్తున్నాడు. వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మధ్యలో ఎన్నికలు రావడం వల్ల కాస్త ఆలస్యం అయినా.. తర్వాత చాలా స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ సడెన్ ఛేంజ్ కనిపించింది.
బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్ ను ఫీమేల్ లీడ్ గా తీసుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇప్పటి వరకూ ఐటమ్ సాంగ్స్ కే పరిమితమైన ఊర్వశి ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ఓ కీ రోల్ చేస్తోంది. అయితే లేటెస్ట్ గా శ్రద్ధా శ్రీనాథ్ ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. ఆమె స్థానంలో అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ ను తీసుకున్నారు. అఖండలో ప్రగ్యా, బాలయ్య మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఆ కారణంతోనే మరోసారి ఆమెను రిపీట్ చేస్తున్నట్టు టాక్. అయితే శ్రద్ధాను వద్దు అనుకోవడానికి కారణాలేంటో మాత్రం చెప్పలేదు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరికి వచ్చింది. రాజస్తాన్ తో పాటు మరికొన్ని లొకేషన్స్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నరు. ఇక ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా బాలయ్య హీరోయిన్ మార్పు అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com