Balakrishna : డాకూ మహరాజ్ గా బాలయ్య

Balakrishna :  డాకూ మహరాజ్ గా బాలయ్య
X

బాలకృష్ణ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన తరుణం వచ్చేసింది. బాలయ్య 109వ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ‘డాకూ మహరాజ్’.. ఇదే బాలయ్య కొత్త సినిమా టైటిల్. బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టైటిల్ తో పాటు అదిరిపోయే టీజర్ కూడా విడుదల చేశారు. టీజర్ కే గూస్ బంప్స్ గ్యారెంటీ అనేలా అంది. ఈ టీజర్ చూసిన తర్వాత బాలయ్య నుంచి మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అవుతోందని ఖచ్చితంగా ఫీలవుతారు. ఆ రేంజ్ లో ఉంది.

‘ఈ కథ వెలుగు పంచే దేవుళ్లది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులనే ఆడించే రావణుడిదీ కాదు.. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది..’ అనే వాయిస్ తో రూపొందిన ఈ టీజర్ లో డైలాగ్స్ పూర్తయ్యే సరికి బాలయ్య డైలాగ్ తో ఎంట్రీ.. ‘పెహచాన్ ముఝే.. డాకూ.. డాకూ మహరాజ్’ అంటూ తనను తాను ఎవరికో పరిచయం చేసకుంటున్న డైలాగ్ అదిరిపోయింది. టీజర్ లో ప్రతి షాట్ అద్భుతం అనేలా ఉంది. ముఖ్యంగా ఇసుక తుఫాన్ లో నుంచి గుర్రాలతో బయటకు వస్తోన్న షాట్ అయితే అబ్బో నెక్ట్స్ లెవల్. అలాగే మెరుపు వెలుగుల్లో విలన్స్ అయిన రవి కిషన్, నితిన్ మెహతా, బాబీ డియోల్ లను పరిచయం చేసిన విధానం.. అదే మెరుపు వెలుగులో బాలయ్య ఫేస్ ను రివీల్ చేసిన విధానం చూస్తే.. ఈ మెరుపులకు సినిమాలో ఏదో కనెక్షన్ ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇక థమన్ మరోసారి థియేటర్స్ అన్నీ పూనకాలతో ఊగిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడని.. టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఎలాగైతే అఖండతో అదరగొట్టాడో.. ఈ డాకూతోనూ మరోసారి అలాగే సౌండ్ బాక్స్ లను బద్దలు కొట్టబోతున్నాడని తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో జనవరి 12న వస్తోన్న డాకూ మహరాజ్ బాక్సాఫీస్ ను డాకూలానే దోచుకోవడం గ్యారెంటీ అనేలా ఉంది టీజర్.

Tags

Next Story