Thaman: 'నా జీవితానికి బాలయ్య బాబు పరమశివుడు: తమన్

Thaman: నా జీవితానికి బాలయ్య బాబు పరమశివుడు: తమన్
Thaman: నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ అఖండ చిత్రానికి తమన్ సంగీతం అందించి మంచి మార్కులు కొట్టేశారు. బాలయ్య తాజా చిత్రం వీరసింహా రెడ్డికి కూడా ఆయనే సంగీతం సమకూర్చారు.

Thaman: నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ అఖండ చిత్రానికి తమన్ సంగీతం అందించి మంచి మార్కులు కొట్టేశారు. బాలయ్య తాజా చిత్రం వీరసింహా రెడ్డికి కూడా ఆయనే సంగీతం సమకూర్చారు. గత రాత్రి హైదరాబాద్‌లో జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ ఈవెంట్‌లో తమన్ మాట్లాడుతూ.. ''నా జీవితానికి బాలయ్యబాబు పరమశివుడు. అఖండ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో పనిచేస్తున్నప్పుడు నేను ఆమ్లెట్ కూడా తినలేదు. నాన్ వెజ్‌కి దూరంగా ఉన్నాను. కఠిన నియమాలు పాటించాను. అందుకే అఖండకు అంత మంచి మ్యూజిక్ అందించగలిగాను. అలాగే అఖండ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు ప్రతిరోజూ లింగ పూజ చేసాను. పరమశివుడి అనుగ్రహంతో బాలయ్య బాబు తరువాతి సినిమా వీర సింహారెడ్డికి కూడా నాకు అవకాశం ఇచ్చారు. దానికి కూడా మంచి పేరు రావడం నా అదృష్టం అని అన్నారు.



మరోవైపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ "బాలయ్య బాబుతో సినిమా తీయాలనుకుంటున్నాను. స్క్రిప్ట్ రాసుకుని ఆయన దగ్గరకు వెళతాను. ఆయన తదుపరి చిత్రానికి తనకి దర్శకత్వం వహించే అవకాశం రావాలనుకుంటున్నాను అని అన్నారు. ఇది నా కోరిక మాత్రమే కాదు, నా నిర్మాతలు, మైత్రీ మూవీ మేకర్స్ కోరిక కూడా. చూడాలి నా ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని హరీష్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story