Balakrishna : ఏపీ రాజధానిలో బాలయ్య రచ్చ

నందమూరి బాలకృష్ణ డాకూ మహరాజ్ టీజర్ వచ్చిన తర్వాత అంచనాలన్నీ మారిపోయాయి. ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోందనే విషయం అభిమానులతో పాటు ఇండస్ట్రీకీ అర్థమైంది. బాబీ డైరెక్ట్ చేసిన డాకూ మహరాజ్ లో బాలయ్య విశ్వరూపం చూస్తారని గ్యారెంటీగా చెబుతున్నాడు దర్శకుడు బాబీ. ఈ మూవీలో బాలయ్యకు విలన్ గా బాబీ డియోల్ నటిస్తుండగా.. ప్రగ్యాజైశ్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందిన చౌదరి ఇతర లీడ్ లో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం మరోసారి హైలెట్ గా నిలవబోతోందని టీజర్ తోనే అర్థమైంది.
సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కాబోతోన్న డాకూ మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న భారీగా ప్లాన్ చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో డాకూ మహరాజ్ ఫంక్షన్ అంటే ఖచ్చితంగా భారీ జనం కూడా వస్తారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేయాలని భావిస్తున్నారు. బాలయ్య ఫస్ట్ టైమ్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నటించిన సినిమా ఇది. నిర్మాత నాగవంశీకి బాలయ్య అంటే ప్రత్యేక అభిమానం. అందుకే అతను కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా పిలవాలనుకున్నారట. బట్ ఆ టైమ్ కు ఆయన అందుబాటులో ఉండకపోవచ్చంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి, బాలయ్య అల్లుడు లోకేష్ ను ముఖ్య అతిథులుగా పిలవబోతున్నారు. ఈ ఫంక్షన్ తో అమరావతిలో తర్వాతి రోజుల్లో సినిమా కళను తీసుకురావడం అనే లక్ష్యం కూడా ఉందంటున్నారు. మొత్తంగా ఏపి రాజధానిలో డాకూ మహరాజ్ గా బాలయ్య రచ్చ చేయబోతున్నాడు అనేది ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com