Balayya Remuneration: టాక్ షో.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటున్నారంటే..
Balayya Remuneration: ఇటీవల తెలుగులో టాక్ షోలు బాగా పాపులర్ అవుతున్నాయి. అందుకే వెండితెరపై స్టార్లుగా వెలిగిపోతున్న హీరోలు, హీరోయిన్లు సైతం ఇలాంటి టాక్ షోలను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు తమ హోస్టింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. వీరితో పాటు ఎన్‌టీఆర్, రానా లాంటి ఈ జెనరేషన్ హీరోలు కూడా హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఆ లిస్ట్‌లోకి త్వరలోనే చేరనున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ.
కేవలం తెలుగువారి కోసమే ఓటీటీగా ప్రారంభమయ్యి.. పలు క్రియేటివ్ షోలతో ఆడియన్స్‌ను మెప్పిస్తోంది ఆహా. ఇప్పుడు అందులోనే హోస్ట్‌గా తన జర్నీని ప్రారంభించనున్నాడు బాలయ్య. 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' పేరుతో ఒక టాక్ షోను ప్రారంభించనున్నట్టు ఆహా ఇప్పటకే స్పష్టం చేసింది. తాజాగా ఆ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు కూడా. ఇక బాలయ్య ఫ్యాన్స్ అంతా తనను డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ షో కోసం బాలకృష్ణ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.
సినిమాల్లో ప్రస్తుతం బాలయ్య చాలా బిజీగా ఉన్నారు. తన అప్‌కమింగ్ ప్రాజెక్టులను పక్కన పెట్టి ఈ టాక్ షో కోసం సమయం కేటాయించడానికి బాలయ్య భారీ పారితోషికమే అందుకుంటున్నారట. ఆయన ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 40 లక్షలు ఛార్జీ చేస్తున్నట్టు సమాచారం. మొత్తం 12 ఎపిసోడ్లు ఉండే ఈ టాక్ షోలో ఎపిసోడ్‌కు 40 లక్షలంటే.. సీజన్ మొత్తానికి దాదాపు రూ. 5 నుంచి 6 కోట్ల పారితోషికం ఆయనకు అందుతున్నట్టే.. ఈ షో గురించి, అందులో బాలయ్య రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్‌గా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com