Balakrishna : మళ్లీ బాలయ్య అన్ స్టాపబుల్ హంగామా
నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చెప్పగానే చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. తన వద్దకు ఎవరైనా వస్తే కొడతాడు. చాలా కోపిష్టి. అనే మాటలు ఎక్కువగా వినిపించేవి. అవన్నీ నిజం కాదు అని నిరూపించిన షో ' అన్ స్టాపబుల్'. ఫస్ట్ టైమ్ ఆయన హోస్ట్ గా చేసిన ఈ షో ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ రేంజ్ నే మార్చేసింది. తన మాటల గారడీతో ఎదుట ఉన్న గెస్ట్ ఎవరైనా.. వారి గురించిన నిజాలు రప్పించేందుకు ఏ మాత్రం బెరుకు లేకుండా ఆయన అడిగిన ప్రశ్నలు.. రప్పించిన సమాధానాలు వీక్షకులకు ఎంతో ఎంటర్టైన్ చేశాయి. ఆహాలో ఆ షో స్ట్రీమ్ అయినంత కాలం విపరీతమైన వ్యూయర్ షిప్ కూడా దక్కిందీ ప్లాట్ ఫామ్ కు. ఇప్పటి వరకూ రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది ' అన్ స్టాపబుల్'. అలాంటి షో ఆగిపోయి చాలా రోజులే అవుతోంది. అయితే ఈ షో మళ్లీ స్టార్ట్ కాదేమో అనుకున్నారు చాలామంది. అందుకు కారణం ఆ మధ్య ఆహాను అమ్మేయబోతున్నారు అనే పుకార్లు రావడమే. బట్ ఆ షో ఆగడం లేదు. త్వరలోనే మళ్లీ స్టార్ట్ కాబోతోంది.
యస్.. అన్ స్టాపబుల్ థర్డ్ సీజన్ రాబోతోంది. అది కూడా ఈ దసరా నుంచే స్ట్రీమ్ అవుతుందని సమాచారం. అయితే ఈ షోలో బాలయ్యతో పాటు మెగాస్టార్ చిరంజీవిని చూడాలని చాలామంది భావించారు. ఈ కాంబినేషన్ కుదరలేదు. అలాగే నాగార్జున కూడా వస్తే బావుండు అనేది చాలామంది అభిప్రాయం. కాకపోతే నాగ్, బాలయ్య మధ్య విభేదాలున్నాయని అంటుంటారు కదా. అందుకే ఆ కాంబో సాధ్యం కాకపోవచ్చేమో కానీ.. మెగాస్టార్ తో ఈ థర్డ్ సీజన్ స్టార్ట్ అయితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.
ఇక బాలయ్య ప్రస్తుతం తన కెరీర్ లో 108వ సినిమా చేస్తున్నాడు. బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈమూవీని డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు. బాలయ్యతో పాటు ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో నటించబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీకి ఓ పవర్ ఫుల్ టైటిల్ కోసం చూస్తున్నారు. అదీ మేటర్. అటు సినిమా ఇటు షో హోస్ట్ గా మళ్లీ బాలయ్య అదరగొట్టబోతున్నాడన్నమాట.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com