Boyapati : బాలయ్య v/s గోపించంద్.. బోయపాటి మాస్టర్ ప్లాన్

మాచో హీరో గోపీచంద్ కు మాస్ లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఆయన ఫిజిక్, బాడీ, యాక్టింగ్ స్కిల్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ, కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఆయన మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. ఒకటి రెండు కాదు.. వరుసగా వస్తున్న ఫ్లాపులు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయి. లౌక్యం తరువాత ఇప్పటివరకు ఆయనక్క సరైన హిట్ లేదు. నిజానికి గోపిచంద్ ను సరైన రీతిలో వాడుకునే దర్శకుడు దొరకడం లేదు. కనీసం దర్శకుడు శ్రీను వైట్ల అయినా ఆయనకు హిట్ ఇస్తాడా చూడాలి. వీరి కాంబోలో వస్తున్న విశ్వం మూవీ అక్టోబర్ 11 విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కాబట్టి.. ఇది హిట్ అయితే హీరోకి మంచి కంబ్యాక్ దొరుకుతుంది.
ఇక మరోపక్క.. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శీను భారీ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్వరలోనే మొదలుకానున్న ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ ని అడిగే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గోపీచంద్ కూడా గతంలో విలన్ గా అద్భుతమైన నటనను కనబరిచిన విషయం తెలిసిందే. వర్షం, జయం, నిజం లాంటి సినిమాల్లో ఆయన విలన్ గా కనిపించి మెప్పించాడు. కానీ, ఆ తరువాత నుండి హీరోగానే కొనసాగుతున్నాడు. నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు కూడా.
మరి ఇలాంటి సమయంలో బాలయ్యకు సవాల్ విసిరే పాత్రకు ఒప్పుకుంటాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అఖండ 2గా ప్రచారంలో ఉన్న బాలయ్య బోయపాటి సినిమా త్వరలోనే మొదలుకానుంది. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో NBK 109 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ లో పూర్తి కానుంది. కాబట్టి.. నవంబర్ లోనే కొత్త సినిమా మొదలుకానుంది అని టాక్. ఆలోగా స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ముగించే పనిలో ఉన్నాడట బోయపాటి. లెజెండ్ సినిమాలో జగపతిబాబు పాత్ర రేంజ్ లో.. కొత్త సినిమాలో విలన్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడట. మరి ఈ ప్రాజెక్టుకి గోపీచంద్ ఒకే చెప్తాడా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com