Balakrishna : బాలయ్యా.. బలే ఉందయ్యా

ఎవరికైనా ఏజ్ పెరుగుతుంటే అలుపు వస్తుంది. బట్ బాలయ్య కు మాత్రం వయసు పెరుగుతున్నా కొద్దీ ఊపు పెరుగుతోంది. లేదంటే ఆ ఎనర్జీ ఏంటీ.. ఆ జోష్ ఏంటీ.. ఆ కమాండ్ ఏంటీ.. అని ఇలాగే అనుకుంటున్నారు జనం. అదీ తాజాగా విడుదలైన అన్ స్టాపబుల్ సీజన్ 4 లో రెండో షో ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత. రీసెంట్ గా చంద్రబాబు నాయుడుతో వచ్చిన ప్రోమోకు జనం ఫిదా అయ్యారు. బట్ ఆ షోలో బాబుగారే కాస్త కమాండింగ్ గా కనిపించారు. అంటే బావగారు కదా అని బాలయ్య కాస్త తగ్గాడేమో. బట్ దుల్కర్ సాల్మన్, వెంకీ అట్లూరి, నాగవంశీ, మీనాక్షి చౌదరిలతో కూడిన ఈ ఎపిసోడ్ ప్రోమో మాత్రం అద్దరగొట్టాడు బాలయ్య. ఇలాంటి ప్రోమోస్ చూసినప్పుడు ఖచ్చితంగా షో చూడాల్సిందే అని ఫిక్స్ అయిపోతారు. తద్వారా ఆహా సబ్ స్క్రిప్షన్ లేని వాళ్లు కూడా తీసుకుంటారు. ఇదే బాలయ్య ఛరిష్మా.
దుల్కర్ సాల్మన్ ను ఓ ఆట ఆడేసుకున్నాడు బాలయ్య. హిందీ, మళయాలం మిక్స్ అయిన పదాలతో ఆకట్టుకున్నాడు. షో మధ్యలో మమ్మూట్టిని వీడియో కాల్ లోకి తీసుకున్నాడు. దుల్కర్ స్పీడ్ గురించి, అతని గాళ్ ఫ్రెండ్స్ గురించి డైరెక్ట్ గా అడిగేశాడు. ఇక నాగవంశీ అయితే దిల్ రాజు పింక్ ప్యాంట్ మీద చేసిన కామెంట్ వైరల్ గా మారింది. వెంకీ అట్లూరికి పూజాహెగ్డే మీద కన్నుంది అని నాగవంశీ అన్నప్పుడు నీ హైటేంటీ.. పూజా హైటేంటీ అంటూ బాలయ్య ఆట పట్టించిన విధానం వెరీ ఎంటర్టైనింగ్ గా ఉంది. మొత్తంగా లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషనల్ కంటెంట్ లానూ కనిపిస్తోన్న ఈ ఎపిసోడ్ దీపావళి రోజు టెలికాస్ట్ కాబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com