Vishal : హీరో విశాల్ పై బ్యాన్

ప్రముఖ కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్పై తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్ పీసీ) నిషేదం విధించింది. గతంలో విశాల్ టీఎఫ్ పీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో దాదాపు రూ.12 కోట్ల నిధులను ఆయన దుర్వినియోగం చేశారంటూ ప్రస్తుత నిర్మాతల మండలి ఆరోపించింది. రీసెంట్ గా తన రత్నం సినిమా రిలీజ్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకోవడమేంటని విశాల్ కొన్నిరోజుల క్రితం ఫైర్ అయ్యారు. దీంతో విశాల్ పై, ఆయన నటించిన సినిమాలపై టీఎఫ్ పీసీ కొన్ని ఆంక్షలు విధించింది. విశాల్తో సినిమాలు ఎవ్వరూ చేయకూడదని ఆదేశించింది. దీంతో టీఎఫ్పీసీ, విశాల్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. టీఎఫ్ పీసీలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీలైతే తనను సినిమా చేయకుండా ఆపడానికి ట్రై చేయాలని ఈ యాక్షన్ హీరో సవాల్ విసిరారు. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారా అంటూ పందెం కోడి నటుడు మండిపడ్డారు. ఈ మేరకు హీరో విశాల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ అవుతుంది. బ్యాన్ ఇష్యూ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి టీఎఫీపీసీ, విశాల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారోనని కోలీవుడ్ అభిమానులు చర్చించుకుంటున్నారు. తానే దర్శకుడిగా మారి తీస్తున్న 'తుప్పరివాళన్ 2' చిత్రంలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com