Bandla Ganesh : నిర్మాతకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్

Bandla Ganesh :  నిర్మాతకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్
X

ఒక సినిమా నష్టాల గురించి పదిహేనేళ్ల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం.. అందుకు హీరోలను నిందించడం అనేది ఇప్పటి వరకూ ఎవరూ చేసి ఉండరేమో. తాజాగా ఆ క్రెడిట్ అందుకున్నాడు నిర్మాత శింగనమల రమేష్ బాబు. రెండు దశాబ్దాల క్రితం చెప్పుకోదగ్గ సినిమాలే చేశాడు రమేష్ బాబు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ కొన్ని చిత్రాలు నిర్మించాడు. ఆ పేరుతో తెలుగులో రెండు భారీ సినిమాలు రూపొందించే ప్రయత్నం చేశాడు. అందులో ముందుగా వచ్చిన చిత్రం పవన్ కళ్యాణ్, ఎస్జే సూర్య కాంబోలో రూపొందిన కొమురం పులి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన సినిమా ఇది.

ఈ కాంబోలో ఆల్రెడీ ఖుషీ వంటి ఇండస్ట్రీ హిట్ ఉంది కాబట్టి.. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమా డిజాస్టర్. అదీ కాక సినిమా కోసం మూడేళ్లకు పైగా టైమ్ పట్టిందట. ఈ కారణంగా తను భారీగా నష్టపోయా అన్నాడు.

ఈ మూవీ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఖలేజా చిత్రాన్ని నిర్మించాడు. ఇదీ పోయింది. దీనికీ అంతే. అప్పటి టైమ్ కంటే చాలా ఎక్కువ కాలం షూటింగ్ చేయడం వల్లే నష్టాలు వచ్చాయంటూ తాజాగా శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ హీరోలపై అక్కసు వెల్లగక్కాడు. ఈ రెండు సినిమాలూ డిజాస్టర్ అయిన తర్వాత ఒక్క హీరో కూడా కనీసం పలకరించలేదని ఆవేదన పడ్డాడు. మరి ఇంతకాలం తర్వాత ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ.. శింగనమల ఆరోపణలపై బండ్ల గణేష్ వెంటనే రియాక్ట్ అయ్యాడు.

‘‘సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు..’’.

ఇదీ బండ్ల గణేష్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో చేసిన పోస్ట్. మొత్తానికి తన అభిమాన హీరోను అన్నాడని వెంటనే రియాక్ట్ అయ్యి ట్రూ ఫ్యాన్ ను అని ప్రూవ్ చేసుకున్నాడు బండ్ల గణేష్. మరి దీనికి రమేష్ బాబు రియాక్ట్ అవుతడా లేదా అనేది చూడాలి.

Tags

Next Story