Bandla Ganesh : పదేళ్ళ గబ్బర్ సింగ్.. హరీష్ కి ఖరీదైన బహుమతి ఇచ్చిన బండ్ల...!

Bandla Ganesh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్ .. పరమేశ్వర ఆర్ట్స్ పై బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించారు. మే 11 2012 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా నిన్నటితో పదేళ్ళు పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్.. దర్శకుడు హరీష్ కి ఖరీదైన బహుమతిని గిఫ్ట్ గా ఇచ్చాడు.
ఓమెగా కంపెనీకి చెందిన సీమాస్టర్ ప్రొఫెషనల్ వాచీని గిఫ్ట్ గా ఇచ్చాడు.. హరీష్ శంకర్‌ను స్వయంగా కలిసి ఈ గిఫ్ట్ ని అందజేశారు బండ్ల.. దీని విలువ సుమారుగా అయిదు లక్షల వరకు ఉంటుంది. ఈ సందర్భంగా గణేష్ కి ధన్యవాదాలు తెలిపాడు హరీష్.. "థ్యాంక్యూ నా బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. గబ్బర్ సింగ్ నిర్మాణ సమయంలో అద్బుతమైన సహకారాన్ని అందించినందుకు.. ఎల్లప్పుడు మీరు నాకు స్పెషల్. నీవు లేకపోతే అంత ఫాస్ట్‌గా మూవీ తియ్యడం సాధ్యం కాదు. నీ అంకిత భావానికి ప్రేమతో ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను" అని హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.
అటు పదేళ్ళ గబ్బర్ సింగ్ పైన బండ్ల స్పందిస్తూ.. "ఎన్ని జన్మల పుణ్య ఫలం ఈ సినిమా నిర్మాణం.. ఈ అవకాశం ఇచ్చిన మా దేవరకు(పవన్ కళ్యాణ్) కృతజ్ఞతలు. బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ కు నా ధన్యవాదములు" అని ట్వీట్ చేశాడు.
Thank you for the surprise my BlockBuster Producer @ganeshbandla thanks again for ur extraordinary support in making GabbarSingh … ur always special to me… 🙏🙏🙏
— Harish Shankar .S (@harish2you) May 11, 2022
Nivvu lekapothe antha fast ga movie ayyedhi kaadhu … love u for ur passion ; https://t.co/3ZkWmjZNDY pic.twitter.com/5ju6zYT0u4
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com