సినిమా

Maa Elections 2021 : హత్యలు, అత్యాచారాల ప్రస్తావన తెచ్చిన బండ్ల గణేశ్

Maa Elections 2021 : అసలే బండ్ల గణేశ్.. ఆ పై మా ఎన్నికల పోలింగ్. ఇక చెప్పేదేముంది. తన స్టేట్ మెంట్స్ తో సంచలనం...

bandla ganesh tv5
X

bandla ganesh tv5

Maa Elections 2021 : అసలే బండ్ల గణేశ్.. ఆ పై మా ఎన్నికల పోలింగ్. ఇక చెప్పేదేముంది. మామూలుగానే తన స్టేట్ మెంట్స్ తో సంచలనం సృష్టించే బండ్ల గణేశ్.. ఇప్పుడూ అలాంటి డైలాగే వదిలారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేస్తానని చెప్పినా.. జీవితారాజశేఖర్ రాకతో ఆయన ఆ ప్యానల్ నుంచి బయటకు వచ్చేశారు.

పోలింగ్ కేంద్రం దగ్గర జరుగుతున్న గొడవలపై స్పందించిన బండ్ల.. లోపల పోలింగ్ జరుగుతోంది.. గొడవలు, హత్యలు, అత్యాచారాలు ఏమీ జరగడం లేదు కదా.. అని ఘాటుగానే సమాధానం ఇచ్చారు. తాను ఓటు వేసిన సభ్యులే గెలుస్తారని చెప్పిన బండ్ల.. ఎవరికి ఓటేశారో మాత్రం చెప్పలేదు. చివరకు.. ఎవరో ఒకరు గెలుస్తారులే అని తిరిగి జోకేశారు.


ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చేసిన తరువాత స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించి మళ్లీ సంచలనం సృష్టించారు. చివరకు ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ లు.. బండ్ల ఇంటికి వెళ్లి నచ్చజెప్పడంతో ఆయన కూల్ అయ్యారు. ఆ తరువాతే తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు. అలాంటి బండ్ల గణేశ్ ఇప్పుడు మా ఎన్నికల ఓటింగ్ కు వచ్చి మళ్లీ హార్డ్ కామెంట్స్ చేశారు.

బండ్ల గణేశ్ ఎప్పుడు ఏది మాట్లాడినా సంచలనంగానే ఉంటుంది. ఒక్కసారిగా తన మాటలతో హైప్ పెంచుతారు. చివరకు వచ్చేసరికీ.. అదంతా తుస్సుమంటుంది. ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తోంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES