సిఎమ్ కు బర్త్ డే విషెస్ చెప్పలేదని టాలీవుడ్ పై బండ్ల గణేష్ సెటైర్స్

సిఎమ్ కు బర్త్ డే విషెస్ చెప్పలేదని టాలీవుడ్ పై బండ్ల గణేష్ సెటైర్స్
X

స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషిగా.. మనసులో ఏది అనిపిస్తే అది బయటికి అనేసే వ్యక్తిగా బండ్ల గణేష్ కు పేరుంది. ముందు నుంచీ కాంగ్రెస్ వాది అయి గణేష్ మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా.. కాంగ్రెస్ ను వీడలేదు. అప్పట్లో టీఆర్ఎస్ నుంచి ఆఫర్స్ వచ్చినా అటు వెళ్లలేదు. రీసెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తాం అని చెప్పినా.. వద్దని పార్టీ గెలుపు కోసం పని చేసి నిఖార్సైన కార్యకర్తను అనిపించుకున్నాడు. అయితే కాంగ్రెస్ విధానాలపై కొన్ని విమర్శలు వస్తున్నప్పుడు తను మౌనంగానే ఉన్నా.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ నుంచి ఎవరూ విషెస్ చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపాన్ని తనదైన శైలిలో ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు.

‘‘గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. ‘‘టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సిఎమ్ గారు కావలెను’’.. అంటూ రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేశాడు.


నిజానికి రేవంత్ రెడ్డి సిఎమ్ అయిన దగ్గర్నుంచీ టాలీవుడ్ ఆయన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. గద్దర్ అవార్డ్ ల విషయంలోనూ నిర్లక్ష్యం చేశారు. అంతకు ముందు ఆయన సిఎమ్ గా అనౌన్స్ అయినప్పుడు కూడా ఎవరూ పెద్దగా విషెస్ చెప్పలేదు. ఈ విషయంలో రేవంత్ కూ టాలీవుడ్ పై కాస్త కోపం ఉన్నా.. ప్రస్తుతం సంయమనం పాటిస్తున్నాడు అంటున్నారు. ఈ టైమ్ లో బండ్ల గణేష్ వేసిన పోస్ట్ అటు టాలీవుడ్ ను ఉలిక్కి పడేలా చేసింది. ఇటు కాంగ్రెస్ కు కూడా టాలీవుడ్ పై ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరాన్ని క్రియేట్ చేసింది. ఏదేమైనా చిట్ట ట్వీట్ తో బండ్లన్న సంచలనం సృష్టించాడు అనే చెప్పాలి.

Tags

Next Story