కాంట్రవర్సీలు వద్దు..గుడ్ బై చెప్పేస్తా.. బండ్ల గణేశ్ సంచలన నిర్ణయం

కాంట్రవర్సీలు వద్దు..గుడ్ బై చెప్పేస్తా.. బండ్ల గణేశ్ సంచలన నిర్ణయం
Bandla Ganesh: సోషల్ మీడియాలో బం‍డ్ల ట్వీట్లు వైరల్‌ అయ్యాయి. అయితే బండ్ల గణేశ్‌..

Bandla Ganesh: బండ్ల గణేశ్ ఎప్పుడు ఏదీ మాట్లాడినా.. ఓ సెన్సేషనల్ అవుతుంది. బండ్ల గణేశ్ గురించి ఎలాంటి అప్ డేట్స్ వచ్చినా నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తారు. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలో బడా నిర్మాతల్లో ఒకరిగా మారారు బండ్ల గణేశ్. అంతేకాదు ప్రొడ్యూసర్‌గా స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మించాడు. రాజకీయాల్లోకి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. బండ్ల కామెంట్స్ నెటింట్లో వైరల్ అయ్యాయి. బండ్ల గణేశ్ తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. సోషల్‌ మీడియాలో తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగినే ప్రతి అంశంపై స్పందిస్తుంటాడు.

సోషల్ మీడియాలో బం‍డ్ల ట్వీట్లు వైరల్‌ అయ్యాయి. అయితే బండ్ల గణేశ్‌ ట్వీటర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నన్నాని ప్రకటించాడు. ఇక త్వరలోనే ట్విటర్ గుడ్ బై చెప్పేస్తా. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా'అని బండ్ల ట్వీట్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా అతని అభిమానులు, ఫాలోవర్స్‌ షాక్‌కు గురయ్యారు. బండ్ల గణేశ్ ఆకస్మత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడా నెటిజన్లు ఆలోచించడం మొదలు పెట్టారు. ఎందుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏమైందో చెప్పండి'అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. బండ్ల గణేశ్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకుంటున్నాడో తెలియాలంటే ఆయన నోరు విప్పక తప్పదు.


Tags

Read MoreRead Less
Next Story