సినిమా

Bandla Ganesh: ఇంకోసారి ఇలా చేయకు.. నీకు దణ్ణం పెడతా: పూరీ జగన్నాథ్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

Bandla Ganesh: పూరీ సతీమణి లావణ్య ఎంతో మంచి మనసున్న వ్యక్తి. మా వదినమ్మ కోసమే ఈ వేడుకకు వచ్చాను.

Bandla Ganesh: ఇంకోసారి ఇలా చేయకు.. నీకు దణ్ణం పెడతా: పూరీ జగన్నాథ్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్
X

Bandla Ganesh: ఎంతో మంది హీరోలను స్టార్స్ ని చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోవడం బాధాకరం అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పరశురామ్, బండ్ల గణేశ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

వేడుకలో పాల్గొన్న బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పూరీ సతీమణి లావణ్య ఎంతో మంచి మనసున్న వ్యక్తి. మా వదినమ్మ కోసమే ఈ వేడుకకు వచ్చాను. పూరీ ఎంతో మందిని స్టార్స్ చేశాడు.. కానీ కొడుకు సినిమా ఫంక్షన్ కి మాత్రం రాకుండా ఎక్కడో ముంబయిలో ఉన్నాడు.. ఇదేం బాలేదు.. ఇలా చేయకూడదు అన్నా. అని పూరీని ఉద్దేశించి అన్నారు.

ఒకవేళ ఇదే పరిస్థితిలో నేనుంటే నా కొడుక్కోసం అన్ని పనులు మానుకుని మరీ వచ్చేవాడిని.. అన్నా ఇంకోసారి ఇలా చేయకు నీకు దణ్ణం పెడతా.. ఎందుకంటే మనం ఏం సంపాదించినా మన భార్యా పిల్లల కోసమే.. వాళ్ల బాధ్యత మనదే.. చచ్చేదాకా వాళ్లను వదలకూడదు. నాలాంటి వాడిని స్టార్ ప్రొడ్యూసర్ ని చేసి నీ కొడుకుని స్టార్ ని చేయకుండా ముంబయిలో ఉంటే మేం ఒప్పుకోం. చోర్ బజార్ లో నీ కొడుకు అదరగొట్టేశాడు.. నువ్వు ఆకాశ్ ని స్టార్ ని చేసినా చేయకున్నా స్టార్ అవుతాడు.. నీ కొడుకు డేట్స్ కోసం నువ్వు క్యూలో నిలబడే రోజు తప్పకుండా వస్తుంది అని బండ్ల గణేశ్ మాట్లాడారు.

Next Story

RELATED STORIES