Bandla Ganesh: మూడోసారి కరోనా బారిన పడిన బండ్ల గణేష్..

Bandla Ganesh (tv5news.in)
X

Bandla Ganesh (tv5news.in)

Bandla Ganesh: ఓ స్టార్ ప్రొడ్యూసర్ కూడా తనకు కరోనా నిర్దారణ అయినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

Bandla Ganesh: ఇప్పటివరకు టాలీవుడ్‌లో పలువురు హీరోలు, హీరోయిన్లు కరోనా బారిన పడ్డారు. వారితో పాటు సీనియర్ నటులు సత్యరాజ్, రాజేంద్రప్రసాద్ కూడా కరోనా వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ కూడా తనకు కరోనా నిర్దారణ అయినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా ఇటీవల కరోనా బారిన పడినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇటీవల మూడు రోజులు ఢిల్లీకి పయణమై హైదరాబాద్‌కు వచ్చిన బండ్ల గణేష్.. మైల్డ్ లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా తనకు కోవిడ్ నిర్దారణ అయిందని తెలిపారు. కాగా బండ్ల గణేష్‌కు కరోనా రావడం ఇది మూడోసారి.


Tags

Next Story