Bandla Ganesh : ఎంతమంది అడ్డొచ్చినా ఎప్పటికీ మిమ్మల్ని పూజిస్తా : బండ్ల గణేష్

Bandla Ganesh : ఎంతమంది అడ్డొచ్చినా  ఎప్పటికీ మిమ్మల్ని పూజిస్తా :  బండ్ల గణేష్
X
Bandla Ganesh : పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్‌‌కి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎంత పెద్ద అభిమానో అందరికి తెలిసిందే.

Bandla Ganesh : పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్‌‌కి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎంత పెద్ద అభిమానో అందరికి తెలిసిందే.. ఇంటర్వ్యూ అయినా, సినిమా వేదిక అయినా తన దేవుడు పవన్ కళ్యాణ్ అని చెబుతుంటాడు బండ్ల.. తాజాగా ఓ అభిమాని తీన్‌‌మార్ మూవీ ఆడియో వేడుకలో పవన్ మాట్లాడిన ఓ వీడియోని బండ్ల గణేష్‌‌కి షేర్ చేయగా దీనిపైన ఆయన స్పందించాడు.. "ఈ జన్మంతా నీ ప్రేమ లోనే మీ అభిమానంతోనే దారిలో ఎంతమంది అడ్డొచ్చినా ఎప్పటికీ మిమ్మల్ని పూజిస్తూ ఈ బండ్ల గణేష్" అంటూ ట్వీట్ చేశాడు.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌‌గా మారింది. కాగా పవన్ నటించిన తీన్‌‌మార్, గబ్బర్‌సింగ్ సినిమాలకి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలో బడా నిర్మాతల్లో ఒకరిగా మారారు బండ్ల గణేశ్. అంతేకాదు ప్రొడ్యూసర్‌గా స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మించారు.

Tags

Next Story