Bandla Ganesh : 'జై బండ్ల.. జైజై బండ్ల'.. భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ..!

Bandla Ganesh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎంత పెద్ద అభిమానో అందరికి తెలిసిందే.. పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఏదైనా ఈవెంట్ ఉందంటే అక్కడ బండ్ల గణేష్ ఉండాల్సిందే.. అభిమానులు కూడా ఇదే కోరుకుంటారు.. నిజానికి పవన్ కళ్యాణ్ స్పీచ్‌ల కంటే బండ్ల గణేష్ .. పవన్ గురించే ఇచ్చే స్పీచ్‌లు ఎక్కువగా ట్రెండింగ్‌లోకి వెళ్తుంటాయి.
అలాంటి బండ్ల గణేష్ నిన్న జరిగిన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించకపోవడంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిరుత్సాహం వ్యక్తం చేశారు. "బండ్లన్న రావాలి.. జై బండ్ల.. జైజై బండ్ల" అంటూ ఈవెంట్లో గట్టిగా అరిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బండ్ల గణేష్ దీనిపైన స్పందించాడు. "మీ ప్రేమకి ధన్యవాదాలు.. మన దేవుడు పవన్ కళ్యాణ్ కి జై" అంటూ రిప్లయ్ ఇచ్చాడు. ఫంక్షన్‌లో బండ్ల గణేష్ ఉంటే మాములుగా ఉండేది కాదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Thank you for your love 🙏 jai our God @PawanKalyan 🙏 https://t.co/9uYVeGKprd
— BANDLA GANESH. (@ganeshbandla) February 23, 2022
కాగా భీమ్లానాయక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రేపు(ఫిబ్రవరి 25)న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో పవన్ తో పాటుగా రానా మరో హీరోగా నటించాడు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com