Bandla Ganesh: చరిత్ర కోసం మీరు కాదు.. మీ కోసం చరిత్ర: బండ్లన్న ట్వీట్ వైరల్

Bandla Ganesh: ఆయనకి పవన్ కళ్యాణ్ మనిషి కాదు దేవుడు. అభిమానించడు.. ఆరాధిస్తాడు, ప్రేమించడు.. పూజిస్తాడు.. ఈశ్వరా.. పవనేశ్వరా అంటూ ఊగిపోతాడు.. ఎంత మంది యంగ్ హీరోలు వచ్చినా పవన్ మ్యానియా అలానే ఉంటుంది..
ఫ్యాన్స్‌కి సైతం పవన్ పేరు వింటే పూనకాలు వస్తాయి.. వాళ్లందరికీ మించి ఉంటుంది బండ్ల గణేశ్‌కి పవన్ మీద అభిమానం.. అది ఏ స్థాయిలో ఉంటుంది అంటే చెప్పడం చాలా కష్టం.. అంత అభిమానం ఉన్న వ్యక్తి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనబడలేదేంటి అని అందరికీ అనుమానం..
తమ అభిమాన నటుడి గురించి బండ్లన్న మాట్లాడితే వినాలని నిజానికి ఫ్యాన్స్‌కి కూడా బాగా ఉంటుంది. ఆయన వాక్చాతుర్యం అలా ఉంటుంది మరి.. తుఫాను ముందు నిశ్శబ్ధంలా బండ్లన్న సైలెంట్‌గా ఉండడానికి బలమైన కారణం ఏదో ఉండి ఉండే ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తున్న భీమ్లా నాయక్‌పై బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలి.. రికార్డులు చిరిగిపోవాలి.. అభిమానులు దిక్కులు పిక్కటిల్లేలా స్వాగతం పలకాలి.. చరిత్ర కోసం మీరు కాదు.. మీ కోసం చరిత్ర దేవర అంటూ తన పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిరుతపులి ఎమోజీలను షేర్ చేశాడు.
మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ... 🙏
— BANDLA GANESH. (@ganeshbandla) February 24, 2022
చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర @PawanKalyan 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅 pic.twitter.com/lVGITxiMnr
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com