Bangarraju : ఓటీటీలోకి బంగార్రాజు, గుడ్‌లక్ సఖి .. ఎప్పుడంటే?

Bangarraju : ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన నాగార్జున బంగార్రాజు, కీర్తి సురేష్ గుడ్‌లక్ సఖి ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. బంగార్రాజు మూవీ . 'జీ 5'లో ఫిబ్రవరి 18 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇక గుడ్‌లక్ సఖి ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై ఆకట్టుకుంది. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇక కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో వచ్చిన గుడ్‌లక్ సఖి మూవీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. నగేశ్ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాని రాత్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com