సినిమా

Bangarraju Box Office Collection: వాసివాడి తస్సాదియ్యా.. 'బంగార్రాజు' కలెక్షన్స్ అదిరిపోయాయిగా..

Bangarraju Box Office Collection: బంగార్రాజుకు దాదాపు 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టాక్.

Bangarraju Box Office Collection: వాసివాడి తస్సాదియ్యా.. బంగార్రాజు కలెక్షన్స్ అదిరిపోయాయిగా..
X

Bangarraju Box Office Collection: నాగార్జున, నాగచైతన్య మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన చిత్రం 'బంగార్రాజు'. 2016లో విడుదలయిన 'సోగ్గాడే చిన్నినాయన'కు ఈ చిత్రం సీక్వెల్. మూడేళ్ల నుండి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా సీక్వెల్ ఇన్నాళ్లకు పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృతి శెట్టి, రమ్యకృష్ణ ఇందులో హీరోయిన్లుగా నటించారు. బంగార్రాజు విడుదలయ్యి మూడు వారాలు అవుతుండగా కలెక్షన్ల విషయంలో కూడా పాజిటివ్‌గానే ఉంది.

బంగార్రాజు మూవీ కోసం నాగార్జున, నాగచైతన్య బాగానే ప్రమోషన్స్ చేశారు. సినిమాకు హైప్ తీసుకొని రావడం కోసం పలువురు అప్‌కమింగ్ హీరోయిన్లను కూడా క్యాస్ట్ చేసుకున్నారు. ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో బంగార్రాజుకు దాదాపు 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టాక్. ఇక ఈ సినిమాకు కలెక్షన్లు కూడా ఆ రేంజ్‌లోనే వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా మూడు వారాల్లో రూ. 38.22 కోట్ల కలెక్షన్లను సాధించింది బంగార్రాజు సినిమా. విడుదలయిన అయిదు రోజుల వరకు ఈ మూవీ కలెక్షన్లు కోట్లలోనే ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సినిమా కలెక్షన్లు రూ. 34.92గా ఉన్నాయి. ఇక ఈ ఇద్దరు అక్కినేని హీరోలు కలిసి అనుకున్నట్టుగా సంక్రాంతికే బంగార్రాజును విడుదల చేసి అనుకుంది సాధించారు అనుకుంటున్నారు అభిమానులు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES