సినిమా

Kalyan Krishna : 'బంగార్రాజు' మూవీ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్‌..!

Kalyan Krishna : అక్కినేని హీరోలైన నాగార్జున, నాగచైతన్యల లేటెస్ట్ మూవీ 'బంగార్రాజు'... సోగ్గాడే చిన్నినాయనాకి సీక్వెల్‌‌గా ఈ చిత్రం తెరకెక్కగా రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు.

Kalyan Krishna :  బంగార్రాజు మూవీ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్‌..!
X

Kalyan Krishna : అక్కినేని హీరోలైన నాగార్జున, నాగచైతన్యల లేటెస్ట్ మూవీ 'బంగార్రాజు'... సోగ్గాడే చిన్నినాయనాకి సీక్వెల్‌‌గా ఈ చిత్రం తెరకెక్కగా రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో, జీ స్టూడియో సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెస్స్ సంగీతం అందించారు.

సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా భారీ వసూళ్ళతో ముందుకు దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా తరవాత డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణ నెక్స్ట్ మూవీ ఏంటి? ఎవరితో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ జ్ఞానవేల్‌ రాజాతో దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ విషయాన్ని అఫీషియల్ గా మేకర్స్ అనౌన్సు చేశారు. అయితే ఇందులో హీరో ఎవరన్నది చూడాలి. జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో ఎక్కువగా తమిళ్ హీరోలు సూర్య. కార్తీలతో చేశారు. వీరిద్దరిలో ఒక్కరితో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story

RELATED STORIES