Bapu Movie : అప్పుడే ఓటిటిలో స్ట్రీమ్ అవుతోన్న ‘బాపు’

కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందు బలే ఆసక్తిని రేకెత్తిస్తాయి. టీజర్, ట్రైలర్ ద్వారా కనిపించిన కంటెంట్ తో ఇంప్రెస్ చేస్తారు. ఇక ప్రమోషన్స్ కాన్ఫిడెంట్ గా ఉంటే ఆడియన్స్ కూడా ఈ మూవీని చూడాలని ఫిక్స్ అయిపోతారు. అలా ఫిబ్రవరి 21న విడుదలైన బాపు కూడా రిలీజ్ కు ముందే చాలామందిని ఆకట్టుకుంది. కొందరైతే ఇది మరో ‘బలగం’ లాంటి మూవీ అవుతుందేమో అనుకున్నారు. నిజానికి ఎమోషన్స్ పరంగా చూస్తే ఆ అవకాశం ఉంది. కాకపోతే దర్శకుడు దయా ఈ కథను సిల్లీగా చెప్పాలనుకున్నాడు. బలమైన ఎమోషన్స్ కు, సంఘర్షణలకు ఆస్కారం ఉన్న కథను కామెడీ పాలు చేసుకున్నాడు. దీంతో ఇది ఎటూ కాకుండా పోయింది.
బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, రచ్చ రవి, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ గురించి బ్రహ్మాజీ చాలా ఊహించుకున్నాడు. కానీ అతనే మైనస్ అయ్యాడు. అందరికంటే ఎక్కువగా బాపుగా సుధాకర్ రెడ్డి ఆకట్టుకున్నాడు.
విడుదలై 20 రోజులు కూడా కాకుండానే ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమ్ అవుతోంది. జియో హాట్ స్టార్ లో బాపు అందుబాటులో ఉంది. ఈ విషయంలో మూవీ టీమ్ పెద్దగా హడావిడీ చేయకపోవడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com