Bhawal Controversy: ఇజ్రాయిల్ ఎంబసీ హాట్ రియాక్షన్

బాలీవుడ్ స్టార్ నటులు వరుణ్ ధావన్, జాన్హవి కపూర్‌ల తాజా చిత్రం 'బవాల్' భారతదేశంలోని ఇజ్రాయెల్ ఎంబసీ, యూదు హక్కుల సంఘాల నుండి సినిమా కంటెంట్‌పై విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ చిత్రం హోలోకాస్ట్ ప్రాముఖ్యతను తక్కువ చేసి చూపిందని వారు ఆరోపించారు. బవాల్ నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్విని అయ్యర్ తివారీ రచించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీన్ని నేరుగా విడుదల చేశారు.
"సినిమాలో కొన్ని సన్నివేశాల్లో పదజాలాన్ని ఉపయోగించడంలో పేలవమైన ఎంపిక ఉంది. ఎటువంటి దురుద్దేశం ఉద్దేశించి సినిమా చేయలేదని మేము భావించినప్పటికీ, హోలోకాస్ట్ భయానక స్థితి గురించి పూర్తిగా అవగాహన లేని ప్రతి ఒక్కరికి దాని గురించి అవగాహన కల్పించాలని మేము కోరుతున్నాము" అని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. నాజీ పాలనలో భయాందోళనల గురించి, లక్షలాది మంది యూదులను ఎలా ఊచకోత కోశారో భారతీయులకు అవగాహన కల్పించాలని వారు కోరారు. ఇదిలా ఉండగా, హోలోకాస్ట్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను, డైలాగ్‌లను తప్పుగా చూపారని ప్రముఖ యూదు హక్కుల సంఘం కూడా విమర్శించింది.
భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ కూడా ఇదే తరహా ట్వీట్‌ను పోస్ట్ చేశారు. తాను ఈ సినిమాను చూడలేదని, కనీసం చూడటానికి కూడా ప్లాన్ చేయలేదని పేర్కొన్నారు. “ నేను విన్నదాని ప్రకారం సినిమాలో ఉపయోగించిన పదజాలం, సన్నివేశాల్లో పేలవమైన ఎంపిక ఉంది. హోలోకాస్ట్ భయానక సంఘటనల గురించి తెలియని వారికి దాని గురించి అవగాహన కల్పించమని నేను కోరుతున్నాను" అని పేర్కొన్నారు.
The Israeli embassy is disturbed by the trivialization of the significance of the Holocaust in the recent movie 'Bawaal'.
— Israel in India (@IsraelinIndia) July 28, 2023
There was a poor choice in the utilization of some terminology in the movie, and though we assume no malice was intended, we urge everyone who may not be…
OTT ప్లాట్‌ఫారమ్ నుండి సినిమాను తొలగించాలని అంతర్జాతీయ మీడియా నివేదించిన తర్వాత రాయబార కార్యాలయం, రాయబారి రంగంలోకి దిగారు. US ఆధారిత సైమన్ వైసెంతల్ సెంటర్ (SWC) - అమెజాన్ ప్రైమ్‌ను నాజీ హోలోకాస్ట్‌ను విపరీతమైన దుర్వినియోగం కారణంగా తీసివేయవలసిందిగా కోరింది.
ఈ పరిణామాలపై స్పందించిన హీరో వరుణ్ ధావన్ ఓపెన్‌హీమర్‌తో ఎవరికీ సమస్యలు లేవని, అయితే కేవలం బావాల్‌తో సమస్య ఉందని ఆయన అన్నారు. ఓపెన్‌హైమర్‌లోని భగవద్గీత సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ, ఇంగ్లీష్ సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల విమర్శలు ఎక్కడికి వెళ్తాయని అడిగారు. దర్శకుడు నితీష్ తివారీ మాట్లాడుతూ.. ఒక కళాఖండాన్ని భూతద్దం పెట్టి చూస్తే ప్రతి కళలోనూ సమస్యలు కనిపిస్తాయని అన్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com