Beast Movie: 'బీస్ట్' ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ ప్లేతో పాటు విజయ్ యాక్టింగ్ అదుర్స్..

Beast Movie: కోలీవుడ్‌లో విజయ్‌కు మామూలు ఫాలోయింగ్ ఉండదు. అందుకే తన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధంగా ఉంటుంది. గత కొంతకాలంగా విజయ్ ఖాతాలో ఫ్లాప్స్ లేవు. మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా విజయ్ సినిమా కలెక్షన్లు లాభాల్లోకి దూసుకుపోతాయి. ఇక త్వరలోనే 'బీస్ట్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్. తాజాగా ఈ మూవీ గురించి ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చింది.
నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న బీస్ట్ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే బీస్ట్ పాటలు సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్‌ను సృష్టించాయి. ముఖ్యంగా 'అరబిక్ కుతు' పాట అయితే ఇంకా రీల్స్‌లో మారుమోగిపోతూనే ఉంది. అంతే కాకుండా బీస్ట్ ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ట్రైలర్ బట్టి చూస్తే ఇదొక టెర్రరిస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అని అర్థమవుతోంది.
ఓవర్సీస్ బోర్డ్ అభ్యర్థి ఉమైర సంధు.. సోషల్ మీడియా ద్వారా బీస్ట్ ఫస్ట్ రివ్యూను బయటపెట్టారు. 'విజయ్ నటన బీస్ట్‌లో చాలా బాగుంది. తను స్క్రీన్ మీదకు వచ్చినప్పుడల్లా ఒక్క డల్ మూమెంట్ కూడా లేదు. ఏమీ ఆలోచించకుండా బీస్ట్‌కు వెళ్లిపోండి అని చెప్తాను నేను. సినిమా బెస్ట్‌గా ఉంది. బీస్ట్.. ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కూడిన యాక్షన్ థ్రిల్లర్. విజయ్ యాక్షన్ కోసం సినిమాకు వెళ్లొచ్చు' అని తన రివ్యూను చెప్పారు ఉమైర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com