Beast Movie: 'బీస్ట్' టీమ్‌కు షాక్.. ఆ దేశంలో సినిమా బ్యాన్..

Beast Movie: తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలోనే 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 13న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తుండగా బీస్ట్ టీమ్‌కు ఓ ఊహించని షాక్ ఎదురయ్యింది.
బీస్ట్ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా కథాంశం అంతా ఒక షాపింగ్ మాల్‌లో జరిగేట్టుగా కనిపిస్తోంది. ఒక మాల్‌ను టెర్రరిస్టులు అటాక్ చేయగా.. హీరో వారిని ఎదురించి ప్రజలను ఎలా కాపాడుతాడు అనేది కథ. అయితే టెర్రరిస్ట్ కథాంశంతో సాగే సినిమా కావడంతో ఓ దేశ ప్రభుత్వం బీస్ట్ సినిమా విడుదలను బ్యాన్ చేసినట్టు సమాచారం.
అరబిక్ దేశాలు ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించడానికి ఇష్టపడవు. అందుకే కొన్ని అరబిక్ దేశాలు ఉగ్రవాదుల కథాంశంతో ఉండే సినిమాల విడుదలకు అంగీకరించవు. అందులో కువైట్ ఒకటి. అయితే బీస్ సినిమా కూడా అలాంటి కథతో సాగుతుంది కాబట్టి కువైట్ ప్రభుత్వం ఈ మూవీ విడుదలను బ్యాన్ చేసిందట. ఇంతకు ముందు దుల్కర్ సల్మాన్ నటించిన 'కురుప్' చిత్రం కూడా కువైట్‌లో విడుదల కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com