Sri Vishnu Swag : స్వాగ్ నుంచి బ్యూటీఫుల్ అండ్ మెలోడీయస్ సాంగ్

శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సినిమా స్వాగ్. రీతూవర్మ హీరోయిన్. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించింది. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనాదిగా వస్తోన్న ఆడ, మగ ఆధిపత్య పోరు నేపథ్యంలో హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందని అర్థం అయింది. ఇంతకు ముందు శ్రీ విష్ణుతో రాజ రాజ చోర అనే మూవీతో దర్శకుడుగా పరిచయం అయ్యి విజయం సాధించిన హసిత్ గోలి ఈ మూవీకి దర్శకుడు. అక్టోబర్ 4న విడుదల కాబోతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేశారు.
డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో సాగే కథగా కనిపిస్తోన్న స్వాగ్ నుంచి వచ్చిన ఈ సాంగ్ వింటేజ్ తెలుగు పాటలను గుర్తు చేస్తోంది. అంటే 80స్, 90స్ టైమ్ లో ఎలాంటి మెలోడీస్ వచ్చేవో అలాన్నమాట. వివేక్ సాగర్ ఇప్పటి వరకూ అందించిన సంగీతానికి భిన్నంగా వినగానే ఫిదా అయిపోయేంత మెలోడియస్ కంపోజింగ్ తో కనిపిస్తోంది. శ్రీ విష్ణు, మీరా జాస్మిన్ మధ్య సాగే గీతం ఇది. ఆ కాలంలో వీరి మధ్య వచ్చిన ఆడ, మగ విభేదాలకు ముందు కనిపించే పాటకావొచ్చు.
‘నీలో నాలో కదలాడు భావమే రాగం.. లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం.. తమకలు తీరాలుగా.. పెదవుల సయ్యాటలా..’ అంటూ సాగే ఈ గీతాన్ని సీనియర్ లిరిసిస్ట్ భువనచంద్ర రాయడం విశేషం. రాజేష్ కృష్ణన్, అంజనా సౌమ్య గాత్రంలో మరింత అందంగా వినిపిస్తోంది. మొత్తంగా ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ కు పూర్తి భిన్నంగా ఉన్న ఈ పాట ఈ తరంతో పాటు ఆ తరం ఆడియన్స్ కు మోస్ట్ ఫేవరెట్ అయ్యే అవకాశాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com