Nilakhi Patra : తెరంగేట్రానికి ముందే అవార్డ్ అందుకున్న ‘బ్యూటీ’

‘బ్యూటీ’ చిత్రంతో నీలఖి త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్ ఫేమ్ వర్ధన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటించారు. నీలఖి తెలుగులోకి పరిచయం కాక ముందే ఒడిశాలో మెరుస్తోంది.. ఒడిశాలో నెంబర్ వన్ చానెల్ అయిన తరంగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన తరంగ్ సినీ ఉత్సవ్ కార్యక్రమంలో యంగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ డెబ్యూ ఫీమేల్ కేటగిరీలో అవార్డు అందుకుంది నీలఖికి. తెలుగులోనూ నీలఖి తన మార్క్ వేసుకుంటారని బ్యూటీ టీం ఎంతో నమ్మకంగా ఉంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన బ్యూటీ పోస్టర్లు, టీజర్‌లో నీలఖి అందరినీ ఆకట్టుకున్నారు. ఎమోషన్స్ పండించడంలోనూ నీలఖి పర్ఫామెన్స్ బాగుందని టీం ఇదివరకే చెప్పేసింది. త్వరలోనే బ్యూటీ చిత్రం థియేటర్లోకి రానుంది. వానరా సెల్యులాయిడ్ బ్యానర్ మీద మారుతి టీం ప్రొడక్ట్‌తో కలిసి జీ స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రం బ్యూటీ. ఈ మూవీకి అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com