Bedurulanka 2012: 'దొంగోడే దొరగాడు' వచ్చేస్తున్నాడు..

యువ నటుడు కార్తికేయ గుమ్మకొండ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ కామెడీ డ్రామా మూవీ 'బెదురులంక 2012'. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ ఆగస్ట్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. అజయ్ ఘోష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ మూవీని నిర్మిస్తుండగా.. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం 'బెదురులంక 2012' నిర్మాతలు తమ చిత్రం నుంచి మూడవ సింగిల్ విడుదల తేదీని ప్రకటించారు. మూడో సింగిల్‌కి 'దొంగోడే దొరగాడు' అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన పోస్టర్, టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రజల విశ్వాసాలను సద్వినియోగం చేసుకునే వ్యక్తుల గురించి ఈ పాటలో చూపించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా ఆగస్టు 3న ఉదయం 9:55 గంటలకు ఇది విడుదల కానుంది.
ఇటీవలే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు విక్రయించబడ్డాయి. ఈ మూవీ రైట్స్ అమ్మకం ధర దాదాపుగా రూ. 5 కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇది ఖచ్చితంగా సినిమాకు ఉన్న మంచి క్రేజ్ వల్ల లభించిన ఆఫర్ అని తెలుస్తోంది. విలేజ్ గ్రూప్ ఈ మూవీని ఓవర్సీస్‌లో విడుదల చేయనుంది. సీడెడ్ ఏరియా హక్కులను శ్రీ ధనుష్ ఫిలింస్ సొంతం చేసుకోగా, నైజాం, ఆంధ్రా హక్కులను శంకర్ పిక్చర్స్ కొనుగోలు చేసింది. ఇప్పటికే 'బెదురులంక 2012' మూవీ ప్రమోషన్స్ ప్రారంభం కాగా.. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఆగస్ట్‌లో మరొక ట్రైలర్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో వెన్నెల కిషోర్, సత్య, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు.
2012లో 'బెదురులంక' అనే రూరల్ పల్లెటూరిలో అక్కడ నివసించే ప్రజల విశ్వాసాలపై ప్రధానంగా సాగే నాటకీయ చిత్రంగా ఈ సినిమా రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాలోని ఎలిమెంట్స్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలిచాయి. 'బెదురులంక 2012' మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రం నుండి వెన్నెల్లో ఆడపిల్ల, సొల్లుడా శివ అనే రెండు పాటలను విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇపుడు మూడో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Beram pedithe, mimmalni kuda ammestaru! Evaru veellu?
— Vamsi Kaka (@vamsikaka) August 1, 2023
The quirky third single #DongodeDoragadu from #Bedurulanka2012 to be out on AUG 3️⃣, 9:55 am 💫#Bedurulanka2012onAUG25 🌊@ActorKartikeya @iamnehashetty @yesclax @Benny_Muppaneni #Manisharma @Loukyaoffl @SonyMusicSouth pic.twitter.com/RSZQuSHzey
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com