చిరంజీవి ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఆయనే..!

చిరంజీవి ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఆయనే..!
ఎలాంటి బ్యాక్‌‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్దదిక్కులా నిలిచిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.

ఎలాంటి బ్యాక్‌‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్దదిక్కులా నిలిచిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఆయనో స్ఫూర్తి. సాధారణ వ్యక్తిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి, చిన్నచిన్న పాత్రలతో మెప్పిస్తూ, హీరోగా అవకాశాలు దక్కించుకొని స్టార్‌‌గా ఎదగడం అంటే మాములు విషయం కాదని చెప్పాలి. అయితే తానూ ఇండస్ట్రీలోకి రావడానికి ఓ వ్యక్తి కారణం అంటూ పలుమార్లు ఆయన వెల్లడించారు. చిరంజీవి తండ్రి చీరాలలో ఎస్ఐ గా పనిచేసేవారు. ఆయన పనిచేస్తున్న పోలీస్‌‌స్టేషన్ లోనే వీరయ్య అనే వ్యక్తి కానిస్టేబుల్‌‌గా పనిచేసేవాడు.

చిరు చెప్పే డైలాగులకు అభినందించేవారు. అర్జెంట్‌‌గా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళమని, బాలీవుడ్ హీరోలా ఉన్నావని అంటూ మెచ్చుకునేవాడు. ఈ మాటలు చిరంజీవి పై బాగానే ప్రభావం చూపించాయి. ఎలాగైనా హీరో అవ్వాలనే తపన ఆయనలో రోజురోజుకూ మరింతగా పెరిగిపోయింది. అదేవిధంగా కానిస్టేబుల్ వీరయ్య తనని అప్పటికప్పుడు స్టూడియోకి తీసుకెళ్లి ఫోటోలు తీయించి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి పంపించారని, ఆ విధంగా అడయార్‌ ఫిలిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు దక్కించుకున్నట్లుగా చిరంజీవి తెలిపారు. ఆ విధంగా కానిస్టేబుల్ వీరయ్య నింపిన స్ఫూర్తితోనే తానూ ఇండస్ట్రీలోకి వచ్చి రాణించగలిగానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

కాగా ప్రస్తుతం చిరు.. ఆచార్య అనే సినిమాలో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Tags

Next Story