Bappi Lahiri Gold : బప్పీలహరికి బంగారం అంటే ఎందుకంత పిచ్చి?

బాలీవుడ్‌కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన లెజెండరీ సింగర్ బప్పీలహరి ఇక లేరు.. గతకొంత కాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన 69 సంవత్సరాల వయస్సులో నిన్న (15 ఫిబ్రవరి 2022)న నవీ ముంబైలో మరణించారు. బప్పీలహరి హిందీ, బెంగాలీ సినిమాలతో పాటుగా కొన్ని తెలుగు , తమిళ, కన్నడ, గుజరాతీ చిత్రాలకి మ్యూజిక్ అందించారు.
బప్పీలహరి అంటే ఆయన పాటలతో పాటుగా వెంటంనే గుర్తొచ్చేది ఆయన ఆహార్యం కూడా.. చాలా బొద్దుగా కనిపిస్తూ.. నల్లని కళ్లద్దాలు పెట్టుకొని, చేతికి గోల్డ్ రింగ్స్, మెడలో కిలోల కొద్దీ బంగారు గొలుసులతో కనిపిస్తారాయన... బంగారం లేకుంటే ఆయన గుర్తుపట్టడం కూడా కష్టమే.. అంతగా ఆయనకి గోల్డ్ అంటే ఇష్టం.. దీనివెనుకున్న సిక్రెట్ ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బప్పీలహరి.
ఓ హాలీవుడ్ పాప్ సింగర్‌ను చూశాక తనకి బంగారం పైన ఇష్టం పెరిగినట్టుగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఓ సాంగ్ రికార్డింగ్ సమయంలో తనకి దేవుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ని వాళ్ళ అమ్మ తనకి బహుమతిగా ఇచ్చిందట.. ఇక పెళ్లయ్యాక కూడా తన భార్య ఓ గణపతి లాకెట్ కూడిన బంగారు గొలుసును ఇచ్చిందట తన మెడలోని గణపతి తనని ఎప్పుడూ సరక్షితంగా ఉంచుతుందని నమ్ముతానని తెలిపారు బప్పీలహరి.
తాను కెరీర్ పరంగా ఎదుగుతున్న కొద్దీ బంగారం మరింత రెట్టింపయ్యిందని పేర్కొన్నారాయన. అందుకే `గోల్డ్ ఈజ్ మై గాడ్` అంటుండేవారాయన. కాగా బప్పీలహరి అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com