Bellamkonda Sai Sreenivas: ఆ విషయంలో చిరంజీవి బాటలో బెల్లంకొండ శ్రీనివాస్..

Bellamkonda Sai Sreenivas: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే తండ్రిలాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టకుండా హీరో అవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదటి సినిమానే వివి వినాయక్ డైరెక్షన్‌లో చేశాడు. కానీ ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు హీరోగా గుర్తింపు వచ్చినా కూడా తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అని చెప్పుకునేలాగా ఒక్క సినిమా కూడా లేదు. అందుకే బాలీవుడ్‌లో అయినా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అక్కడ అడుగుపెట్టాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఛత్రపతి' సినిమా రీమేక్‌తో బీ టౌన్ ప్రేక్షకులను పలకరించనున్నాడు.
అయితే మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలోనే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కూడా రాజశేఖర్ హీరోగా నటించిన 'అంకుశం' రీమేక్‌తో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. తెలుగు దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించాడు. అలాగే బెల్లంకొండ కూడా ప్రభాస్ నటించిన చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వివి వినాయక్‌కు కూడా హిందీలో ఇదే మొదటి చిత్రం.
నాగార్జున, వెంకటేశ్ లాంటి హీరోలు కూడా బాలీవుడ్‌లో హీరోలుగా వెలిగిపోయారు. కానీ వీరు ఎవరి సినిమాను వారే హిందీలో రీమేక్ చేసి అక్కడ హీరోలుగా పరిచయమయ్యారు. చిరంజీవి మాత్రమే ఇతర హీరో సినిమాతో బీ టౌన్‌లో అడుగుపెట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com