Kishkindhapuri : అనౌన్స్ మెంట్ లే కానీ రిలీజ్ లు ఉండవా శ్రీనివాస్

పదేళ్ల కెరీర్ లో 9 సినిమాలు చేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రతి సినిమాకూ కష్టపడుతున్నాడు కానీ.. అతని కష్టానికి ఫలితం అన్నిసార్లూ రావడం లేదు. సక్సెస్ రేట్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. చివరగా వచ్చిన ఛత్రపతి హిందీ రీమేక్ బిగ్ డిజాస్టర్ అయింది. కొంత గ్యాప్ తీసుకుని వరుసగా సినిమాలు మొదలుపెట్టాడు. వీటిలో ఏదీ చివరి వరకూ వెళ్లడం లేదు. విచిత్రం ఏంటంటే.. అతన్నుంచి కొత్త సినిమాలు అనౌన్స్ అవుతున్నాయి కానీ ఏదీ రిలీజ్ డేట్ తో కనిపించడం లేదు. ఎప్పుడో మొదలైన టైసన్ నాయుడు ఏమైందో ఎవరికీ తెలియదు. అది పక్కన పెట్టి చేసిన భైరవం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేకపోతున్నారు. రీసెంట్ గా హైందవ అని మరోటి ప్రకటించారు. ఇవి కాక వీటికి ముందే అనౌన్స్ అయిన ఓ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు.
ఇక తాజాగా అనౌన్స్ అయిన మూవీ టైటిల్ ‘కింష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ ఇద్దరూ గతంలో రాక్షసుడు అనే బ్లాక్ బస్టర్ లో కలిసి నటించారు. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తోన్న కిష్కింధపురిని సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక గ్లింప్స్ చూస్తే టీజర్ లానే కనిపిస్తోంది. శ్రీనివాస్, అనుపమతో పాటు కమెడియన్ సుదర్శన్ కలిసి ఓ హాంటెడ్ హౌస్ లోకి వెళతారు. అది అత్యంత ప్రమాదకరమైన స్థలం అని గ్లింప్స్ లో సబ్ టైటిల్స్ లా వేశారు. మరి అక్కడికి వీళ్లు ఎందుకు వెళ్లారు.. ఎలా తప్పించుకున్నారు అనే పాయింట్ లా కనిపిస్తుంది. విజువల్స్ బావున్నాయి. షాట్స్ ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ‘కొన్ని తలుపులు ఎప్పటికీ తీయకూడదు, కొన్ని గొంతులు ఎప్పటికీ వినకూడదు, కొన్ని స్థలాలు మర్చిపోవాలి..’ అంటూ వేసిన టైటిల్స్ అంచనాలు పెంచేలా ఉన్నాయి. శ్యామ్ సిఎస్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నిలబెట్టబోతున్నాడనేలా గ్లింప్స్ లోనే ఆర్ఆర్ అదిరిపోయింది.
ఇక ఈ కిష్కింధపురితో కలిపి శ్రీనివాస్ చేస్తున్నది మొత్తం నాలుగు సినిమాలన్నమాట. వీటిలో ఏది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.. చివరికి మేకర్స్ కు కూడా అనే సెటైర్స్ కూడా పడుతున్నాయి సాయి శ్రీనివాస్ సినిమాల లైనప్స్ పై. ఏదేమైనా ఇలా నిర్మాతలను వెయిటింగ్ చేయిస్తూ.. ఒక్క సినిమా కూడా పూర్తి చేయకుండానే మరో సినిమాకు కమిట్ కావడం తప్పేనేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com