కలిసి కనిపిస్తే కథలల్లేస్తారా: హీరో ఫైర్
హీరో, హీరోయిన్ కలిసి సినిమాల్లో నటిస్తారు.. కానీ కలిసి బయట కనిపిస్తే మాత్రం అడ్డంగా బుక్ చేసేస్తారు మీడియా వాళ్లు. ఇద్దరి మధ్యా ఏదో ఉందంటూ పుంఖాను పుంఖాలుగా కథలు రాసేస్తారు.. అది భరించలేక బరస్టైపోతుంటారు కొందరు నటీనటులు.. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఫైర్ అయ్యారు.
సహనటి రష్మిక, తాను ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించామని దాంతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని వాపోయారు. ఈ వార్తల్లో నిజం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. ఇద్దరం హైదరాబాద్‌కు చెందిన వాళ్లం కావడంతో తరచుగా షూటింగ్ పనిమీద ముంబై వెళుతుంటాం. ఆ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో కలుస్తుంటాం. దానికి ఏదేదో ఊహించుకుని ఏవేవో రాస్తుంటారు. అవన్నీ రూమర్స్ మాత్రమే అని అన్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఛత్రపతిలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు. అతడికి జోడీగా నుస్రత్ భరుచా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రభాస్ కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఛత్రపత్రికి ఇది రీమేక్. ఈ చిత్రం మే12న థియేటర్లలో రిలీజ్ కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com