Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా మూవీ ‘హైందవ’

Bellamkonda Srinivas :  బెల్లంకొండ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా మూవీ ‘హైందవ’
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రాబోతున్నాడు. వీటిలో అన్నికంటే వెనక కమిట్ అయిన భైరవ ముందుగా విడుదలవుతుందంటున్నారు. ముందు కమిట్ అయిన టైసన్ నాయుడు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. బట్ ఈ లోగా ఓ ప్యాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు సాయి శ్రీనివాస్. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. వీళ్లు అనౌన్స్ చేయకపోయినా ఈ గ్లింప్స్ చూడగానే ఇది ప్యాన్ ఇండియా మూవీ అని ఫిక్స్ అయిపోవచ్చు. గ్లింప్స్ అంటే ఏదో సెకన్స్ లో కాదు.. ఏకంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లోని ఇంపార్టెంట్ పార్ట్ నే విడుదల చేశారు.

లుధీర్ రెడ్డి బైరెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈమూవీ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ అనేలా ఉంది. ప్రస్తుతం దేశంలో హిందూత్వ గురించిన సినిమాలంటే కంట్రీ మొత్తం చూస్తోంది. ఆ ట్రెండ్ లో ఇది ఏకంగా ‘హైందవ’ అనే టైటిల్ తో రూపొందుతోంది. గ్లింప్స్ చూసే దర్శకుడి ప్రతిభావంతుడు అని ఫిక్స్ అయిపోవచ్చు.

అనగనగా ఓ దేవాలయం. ఆ దేవాలయాన్ని అవమానించేందుకు కొందరు ముష్కరులు ప్రయత్నిస్తారు. అక్కడి విగ్రహాలపై నల్ల రంగు పూస్తారు. అక్కడికి ఓ కుర్రాడు చెప్పులు లేకుండా బైక్ పై వస్తూ ఉంటాడు. అతను బయలుదేరగానే.. దారిలో ఓ తేలు కొండి విసురుతుంది.. గుడి ముందు కోనేటిలో చేపలు ఎగురుతాయి.. తుపాకీ పేల్చగానే సింహం గర్జన చేస్తూ అతన్ని వెంబడిస్తుంది. ఓ వరాహం ఆ సింహాన్ని ఫాలో అవుతుంది. మరోవైపు తాబేలు తల పైకెత్తి చూస్తుంది.. ఆ క్రమంలో జరిగిన యాక్షన్ ఎపిసోడ్ తర్వాత వైష్ణవాచారం ప్రకారం మంటలతో కూడిన పంగనామాలు ఆవిష్కృతమవుతుంది.

ఇక్కడ దర్శకుడి బ్రిలియన్సీ ఏంటంటే.. తేలుతో వృశ్చికాన్ని గుర్తు చేశాడు. సింహంతో నరసింహాన్ని తలపించాడు. వరాహవతారం, తాబేలుతో కూర్మావతారం, చేపలతో మత్స్యావతారం చివర్లో రాముడు కనిపించడం.. ఇవన్నీ టైటిల్ కు తగ్గట్టుగా అద్భుతమైన సింబాలిజంతో కనిపించేలా డిజైన్ చేయడం.. ఇవి చాలు కదా.. దర్శకుడు ఎంత తెలివిగా ఈ కథను రాసుకున్నాడో అనడానికి.

శ్రీనివాస్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన కథతో వస్తున్నాడని అర్థం అవుతోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకోవడానికి కావాల్సిన అంశాలన్నీ గ్లింప్స్ లోనే చూపించాడు దర్శకుడు. సో.. ఆ మేరకే ప్రమోషన్స్ చేస్తే.. శ్రీనివాస్ డబ్బింగ్ మార్కెట్ తో నార్త్ లో బాగా తెలిసిన వాడు కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు. ఇక ఈ మూవీతో శ్రీనివాస్ సరసన హిట్ బ్యూటీ సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ చందు నిర్మిస్తున్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా శివేంద్ర సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు.

Tags

Next Story