Hrithik Roshan: హృతిక్ రోషన్‌కు బెస్ట్ బాయ్‌ఫ్రెండ్ అవార్డు: స్నేహితురాలి చెప్పులను..

Hrithik Roshan: బెస్ట్ బాయ్‌ఫ్రెండ్ అవార్డు నటుడు హృతిక్ రోషన్‌కు ఇవ్వాలని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు నెటిజన్లు. నీతా అంబానీ సాంస్కృతిక వేడుకలో హృతిక్ తన స్నేహితురాలు సబా ఆజాద్ స్టిలెట్‌టోస్‌ని పట్టుకుని కనిపించిన ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) స్టార్-స్టడెడ్ లాంచ్‌కు హృతిక్, సబా హాజరయ్యారు. అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన కస్టమ్ మేడ్ లాంగ్ గౌనును సబా ధరించారు.
మనలాగే, సబా కూడా హైహీల్స్ వేసుకుని పార్టీలో తిరగడానికి ఇబ్బంది పడిందేమో. హీల్స్‌తో మడమల నొప్పులు వచ్చి ఉంటాయి. ఆమె బాధ నుంచి ఉపశమనం కోసం చెప్పులు విప్పేసింది. అక్కడిక్కడా పెడితే పోతాయనుకున్నారో ఏమో.. హృతిక్ ఆమె చెప్పులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా స్నేహితురాలి చెప్పులను చేత్తో పట్టుకునే పార్టీకి వచ్చిన వారితో మాట్లాడుతూ కనిపించాడు. సబా డిజైనర్ అమిత్ అగర్వాల్‌తో ఫోటోకి ఫోజులు ఇస్తోంది. నెటిజన్లు హృతిక్‌ను గుర్తించి, ఉత్తమమైన వ్యక్తి అని హార్ట్ ఎమోజీలను పంపడం ప్రారంభించారు.
సబా ఆజాద్‌కు హృతిక్ రోషన్ బెస్ట్ బాయ్‌ఫ్రెండ్ అని అభిమానులు ప్రశంసించారు
ఒక సోషల్ మీడియా వినియోగదారు ఇలా వ్రాశాడు, హృతిక్ రోషన్ చాలా మామూలుగా ఆ చెప్పులను పట్టుకుని ఉన్నాడు.. నిజంగా గ్రేట్.. ఒక స్టార్ హీరో అయ్యుండి ఏ మాత్రం ఇబ్బంది పడకుండా పట్టుకున్నాడు దటీజ్ హృతిక్ అని అతడి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మరొక అభిమాని ఇలా వ్రాశాడు, "అతను ఉత్తమ ప్రియుడు, అబ్బాయిలు దయచేసి గమనించండి." అని కామెంట్లు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com