Anasuya Bharadwaj: గుండు కొట్టించుకోవడానిక్కూడా సిద్ధమే..: అనసూయ

Anasuya Bharadwaj: అందమైన యాంకర్ ఎవరంటే అనసూయ అని టక్కున చెప్పేస్తారేమో బుల్లి తెర ప్రేక్షకులు. అటు యాంకర్‌గా రాణిస్తూనే సినిమాల్లో కూడా పవర్‌ఫుల్ పాత్రల్లో నటిస్తూ తన ఇమేజ్‌ని పెంచేసుకుంది. తన నటన ద్వారా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ స్టార్ స్టేటస్‌ని సంపాదించుకుంది. అప్పుడు రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ, ఇప్పుడు దాక్షాయణిగా మరోసారి ప్రేక్షకులకు గుర్తుండి పోయే పాత్ర చేస్తుంది.
పుష్ప యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే అనసూయ పాత్రకు చాలా వెయిట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు ఆ పోస్టర్ చూస్తే అనసూయేనా అని అనిపించేలా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ అప్పుడప్పుడు సామాజిక సమస్యలపై స్పందిస్తుంటుంది. తాజాగా తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించింది. అడిగిన వారికి తడుముకోకుండా సమాధానం చెప్పింది.
ఇందులో భాగంగా ఓ నెటిజన్.. పెద్ద సినిమాలో మంచి రోల్ వస్తే.. ఆ పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తప్పకుండా.. క్యారెక్టర్ కోసం అవసరమైతే తాను గుండు కొట్టించుకోవడానికి సిద్ధం అని అందాల అనసూయ ఓపెన్న స్టేట్‌మెంట్ ఇచ్చింది. అనసూయ సమాధానం విన్న నెటిజన్లు ఆమె డెడికేషన్‌కు ఫిదా అయ్యారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com