Bhagyashri Borse : నేను రవితేజ హీరోయిన్ ని.. అలా ఎందుకు చేస్తాను..

నేను రవితేజ హీరోయిన్ ని.. అలా ఎందుకు చేస్తాను.. అంటోంది మిస్టర్ బచ్చన్ ముద్దుగుమ్మ భాగ్య శ్రీ బోర్సే. ఈ స్టేట్మెంట్ చూస్తే ఏమనిపిస్తోంది..?ఎవరికి ఏం అనిపించినా అమ్మడికి అనిపించింది అనేసింది అంతే. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూల ‘ మీరు ఎప్పుడైనా సెట్స్ కు ఆలస్యంగా వెళ్లారా.. ’ అనడిగారు. దీనికి భాగ్యశ్రీ ఇచ్చిన సమాధానం అది. అంటే మాస్ మహరాజ్ టైమ్ ను కరెక్ట్ గా మెయిన్టేన్ చేస్తాడని.. అలాంటి హీరోతో పనిచేస్తున్నప్పుడు నేను కూడా ఆయనలాగే ఇన్ టైమ్ లో ఉంటాను కానీ లేట్ గా ఎందుకు వస్తాను అనేది ఆవిడ భావం, భావన అన్నమాట.
అయితే భాగ్యశ్రీ మాటలు చూసిన చాలామంది.. అమ్మడు అప్పుడే మాటలు నేర్చింది.. ఫర్వాలేదు టాలీవుడ్ లో కొన్నాళ్లు నిలబడుతుంది అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఒకరిని చూసి డిసిప్లిన్ నేర్చుకున్నప్పుడు వారి చాటుగా తమ గురించి చెప్పుకోవడం తప్పేం కాదు. కాకపోతే ఇక్కడ ఏం మాట్లాడినా పెడర్థాలు తీసే బ్యాచ్ చాలానే ఉంది. అందుకే వాళ్లంతా భాగ్యశ్రీపై ఇలా సెటైర్స్ వేస్తుున్నారు.
ఇక ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే భాగ్య శ్రీకి టాలీవుడ్ ఫిదా అయిపోయింది. మిస్టర్ బచ్చన్ పాటలతో పాప తెలుగువారిని ఫిదా చేసింది. అందుకే వెంటనే విజయ్ దేవరకొండ మూవీలోనూ ఆఫర్ కొట్టేసింది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయిన తర్వాత భాగ్యశ్రీకి ఆఫర్స్ వెల్లువెత్తుతాయి అంటున్నారు. ఏదేమైనా ఇలా ఓపెన్ గా నేను రవితేజ హీరోయిన్ ని అని చెప్పుకుంటోందంటే మాస్ రాజా తనను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com