Bhairavam Movie : భైరవం పెద్దలకు మాత్రమే

Bhairavam Movie :  భైరవం పెద్దలకు మాత్రమే
X

తమిళ్ లో రూపొందిన గరుడన్ అనే చిత్రాన్ని తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్ వల్ల ప్రస్తుతం ఈ మూవీ బాయ్ కాట్ నిరసనను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ భైరవం’అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతున్నా.. తమ చిత్రానికి ఏమీ కాదు అనే ధీమాతో ఉంది టీమ్. ఇక అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై ఫీమేల్ లీడ్స్ లో కనిపించిన ఈమూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలా అనిపించింది. వయొలెన్స్ కూడా కాస్త ఎక్కువే అనిపించింది.

ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ వయొలెన్స్ కారణంగానో లేక ఇంకేవైనా కారణాలున్నాయో కానీ.. చిత్రానికి ‘ఏ’సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్. అంటే భైరవం పెద్దల కోసమే అన్నమాట. ఇక సినిమా నిడివి కూడా ముగ్గురు హీరోలున్నా.. తక్కువగానే ఉంది.2 గంటల 35 నిమిషాల నిడివితో ఎంటర్టైన్ చేయబోతోంది భైరవం. మరి ప్రస్తుతం ఉన్న బాయ్ కాట్ ట్రెండ్ ను దాటుకుని ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ.. ఆ చిన్న వివాదం కూడా లేకపోతే అసలే పోటీ లేని టైమ్ లో వస్తోంది కాబట్టి మరింత ప్లస్ అయ్యి ఉండేదేమో.

Tags

Next Story