Bhairavam collections : ముగ్గురు హీరోలు మూడున్నర కోట్లు

Bhairavam collections :  ముగ్గురు హీరోలు మూడున్నర కోట్లు
X

స్టార్ హీరో అయినా స్మాల్ హీరో అయినా.. ఫస్ట్ డే కలెక్షన్స్ ను బట్టి సినిమా సక్సెస్ రేంజ్ డిసైడ్ అవుతుంది. ఈ వారం విడుదలైన ఏకైక స్ట్రెయిట్ తెలుగు మూవీ ‘భైరవం’. ముగ్గురు హీరోలు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుంది అనుకున్నారు. ట్రైలర్ చూశాక భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ తమిళ్ లో హిట్ అయిన మూవీ కాబట్టి ఇక్కడా ఆ విజయం రిపీట్ అవుతుందనుకున్నారు. అనుకున్నట్టే టాక్ బావుంది. కానీ ఓపెనింగ్స్ అంత బాలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి అంచనాలకు తగ్గ ఓపెనింగ్స రాలేదు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ డే కేవలం 3.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

కంటెంట్ పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ సగం వరకూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ కు అరగంట ముందు నుంచి ఊపందుకుంది. ఎప్పుడైతే కథలో సంఘర్షణ మొదలవుతుందో అప్పటి నుంచి ఆడియన్స్ ను ఇక ఏ ఇబ్బందీ లేకుండా కూర్చోబెడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ట్విస్ట్ తో పాటు ఇంటర్వెల్ తర్వాత మూడు పాత్రల మధ్య పోటాపోటీగా కనిపించిన సన్నివేశాలు.. అలాగే వారి స్నేహం, వెన్నుపోటు.. ఆలయ భూములు, మినిస్టర్ స్వార్థం.. అలాగే హీరోల భార్యల నైజాలు ఇవన్నీ కథలో భాగంగా ముందుకు సాగుతూ కథనాన్ని రక్తి కట్టాస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్, అదితిల లవ్ స్టోరీ అంతగా ఆకట్టుకోదు. సెకండ్ హాఫ్ లో పాట సైతం అవసరం లేదేమో అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి శ్రీనివాస్ అదరగొట్టాడు. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. అన్ని పాత్రలకూ ప్రాధాన్యత ఉండటం ఈ సినిమాలో కనిపించే మరో ప్రత్యేకత. మొత్తంగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ గా స్నేహం, సెంటిమెంట్, వెన్నుపోటు వంటి అంశాలతో ప్రీ ఇంటర్వెల్ నుంచి బాగా మెప్పిస్తుందీ సినిమా. మరి ఈ టాక్ ను బట్టి కలెక్షన్స్ మరింత పెరుగుతాయేమో కానీ ఓపెనింగ్స్ మాత్రం కాస్త నిరాశపరిచాయి అనే చెప్పాలి.

Tags

Next Story